లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Life Style

పసుపు పాలు తాగండి..రోగాల నుంచి దూరంగా ఉండండి

Published

on

Drink turmeric milk : శీతాకాలం రోగాల సీజన్. అంటు వ్యాధులు ప్రబలుతుంటాయి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారు తరచూ రోగాల బారిన పడుతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న తరుణంలో..ఆరోగ్యంగా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. రోగ నిరోధక శక్తి పెంచే ఫుడ్స్ తినాలని సూచిస్తున్నారు. అందులో ప్రధానమైంది. ‘పసుపు పాలు’. ప్రతి రోజు పాలు తాగే వారు..కొద్దిగా పసుపు కలుపుకుంటే..ఎంతో మేలు అంటున్నారు.పాలల్లో కావాల్సిన పోషకాలు ఉంటాయనే సంగతి తెలిసిందే. ఈ పాలకు పసుపు కూడా తోడైతే..ఆరోగ్యానికి అదనపు ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు. పురాతనకాలంలో పసుపుతో కూడిన పాలను తాగే వారు. దగ్గు, జలుబుతో బాధ పడేవారు..పసుపు పాలు తాగితే బెటర్ అని వెల్లడిస్తున్నారు. పాలల్లో సెరటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. అదే పసుపులో వైటల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయంటున్నారు. పసుపు పాలల్లో నల్ల మిరియాలు, దాల్చిన చెక్క, ఏలకులు, తేనె, నిమ్మరసం కలుపుకుంటే..ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి.ముక్కు దిబ్బడ, తలనొప్పి, శరీర నొప్పులను దూరం చేస్తుంది.
శరీరంలో వైరస్ వృద్ధిని అరికడుతుంది.
పసుపులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడుతాయి.
కాలేయంలో చేరే విషకారకాలను దూరం చేస్తుంది.
కాలేయ సంబంధ పచ్చ కామెర్ల లాంటి వ్యాధులు దరిచేరవు.ప్రధానంగా రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
రుతుక్రమం సమస్యల పరిష్కారానికి ఎంతో ఉపయోగం.
చక్కెర కలిపిన పాలను వేడి చేసి అందులో చిటికెడు పసుపు వేసుకుని తాగితే..జలుబు తగ్గుతుంది.
ఊపిరితిత్తులో ఉన్న కఫం కరగడంతో పాటు..ఊపిరి తీసుకోవడం సులువవుతుంది.
నిద్రలేమి సమస్యతో బాధ పడే వారు పసుపు మంచి ఔషధంలా పనిచేస్తుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *