లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Movies

‘దృశ్యం 2’ లో లాయర్ రేణుక ఎవరో తెలుసా!

Updated On - 12:29 pm, Tue, 23 February 21

Santhi Priya: జార్జ్ కుట్టిగా కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ డిజిటల్ మీడియాలో సందడి చేస్తున్నారు.. మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ బ్లాక్‌బర్ ‘దృశ్యం’ 2013 లో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఆ సినిమాకి సీకెల్వ్‌గా వచ్చిన ‘దృశ్యం 2’ పాపులర్ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ అయ్యి అదిరిపోయే టాక్ సొంతం చేసుకుంది.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ మీద ఆంటోని పెరుంవబూర్ నిర్మించిన ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించిన ఓ నటి గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఎక్కడ చూసిన ఆమె గురించిన చర్చే జరుగుతోంది. ‘దృశ్యం 2’ లో రేణుక అనే లాయర్ పాత్రలో అదరగొట్టిన శాంతి మాయాదేవి అలియాస్ శాంతి ప్రియ గురించిన విశేషాలేంటో చూద్దాం..

Drushyam 2

రీల్ లైఫ్‌లో న్యాయవాదిగా కనిపించి ఆకట్టుకున్న శాంతి ప్రియ రియల్ లైఫ్‌లోనూ అడ్వకేటే.. ఎర్నాకులంకు చెందిన శాంతి ప్రియ, మొదట లిటరేచర్‌లో డిగ్రీ, తర్వాత కేరళ లా అకాడమీ నుంచి లా గ్రాడ్యేయేషన్ చేసి, సైబర్ లా డిప్లొమా కూడా చేశారు. ఎర్నాకులంలోనే ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన శాంతి, సుప్రీంకోర్టులో శబరిమల ఇష్యూలోనూ ఇన్‌వాల్వ్ అయి ఉన్నారు.. కేరళ హై కోర్టులోనూ కేసులు వాదిస్తున్నారామె. భర్త షిజు రాజశేఖర్, కుమార్తె ఆరాధ్య రేష్మిక పౌర్ణమితో కలిసి ఉంటున్నారు శాంతి ప్రియ. కొన్నాళ్లు ఏషియా నెట్‌కి చెందిన అమృత టీవీలో యాంకర్‌గా పని చేసిన శాంతి ప్రియ.. సోషల్ యాక్టివిస్టు, కాలమిస్టు కూడా..

Santhi Priya

మొదట 2019లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన ‘గానగంధర్వన్’ అనే సినిమాలో లాయర్‌గా కనిపించారు శాంతి.. ఫస్ట్ మూవీలోనే హీరోని కాపాడే లాయర్‌ పాత్రలోఅదుర్స్ అనిపించారు. తర్వాత 2021లో ‘దృశ్యం 2’ లో మరో సూపర్‌స్టార్ మోహన్ లాల్ ను సేవ్ చేసేందుకు వచ్చే న్యాయవాదిగా ఆకట్టుకున్నారు. ప్రొఫెషనల్ లాయర్ అయిన శాంతి ఇద్దరు అగ్రహీరోల సినిమాల్లోనూ కథానాయకులను కాపాడే లాయర్ పాత్ర పోషించడం విశేషం.

Santhi Priya

‘దృశ్యం 2’ లో ఆమె నటన చూస్తే పార్ట్ టైమ్ యాక్ట్రెస్ అనుకోరు.. చాలా అనుభవం ఉన్న నటిలా నటించి ఆకట్టుకున్నారామె. ఈ మధ్య ఓ ఇంటర్వూలో ఇకముందు సినిమాల్లో నటిస్తారా అనడిగితే.. మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను కానీ సినిమాల్లోనూ లాయర్ వేషాలే వెయ్యాలా.. అంటూ నవ్వేశారు శాంతి ప్రియ.

 

View this post on Instagram

 

A post shared by Santhi Priya (@saanthim)