-
Home » టార్గెట్ న్యూఇయర్, హైదరాబాద్‌పై మళ్లీ పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా
Crime
టార్గెట్ న్యూఇయర్, హైదరాబాద్‌పై మళ్లీ పంజా విసురుతున్న డ్రగ్స్ మాఫియా
Published
2 months agoon
By
naveen
hyderabad drugs mafia: హైదరాబాద్‌లో డ్రగ్స్ భూతం మళ్లీ పంజా విసురుతోంది. నగరాన్ని డ్రగ్స్ మయం చేసేందుకు మత్తు మాఫియాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే కొత్త పేర్లు, సరికొత్త మార్గాల్లో నగరానికి డ్రగ్స్ తరలిస్తున్నారు. జనాల బలహీనతను ఆసరాగా చేసుకుని దందా చేస్తున్నాయి. న్యూ ఇయర్ సమీపిస్తుండటంతో నగరవాసులను మత్తులో ముంచేత్తేలా మరింత దూకుడు పెంచాయి డ్రగ్స్ ముఠాలు.
భాగ్యనగరాన్ని కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. వరుసగా పట్టుబడుతున్న మత్తు ముఠాలు.. న్యూ ఇయర్ వేడుకులకు తరలి వస్తున్న డ్రగ్స్.? తాజాగా యెమెన్ దేశస్తులతో సహా నలుగురు అరెస్టు.. ఓ వైపు సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ విక్రయం.. మరోవైపు అమ్మాయిలను ఎరగా వేసి డ్రగ్స్ దందా.. పోలీసులు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నా..ఆగని దందా
క్యాష్ కొడితే చాలు:
హైదరాబాద్..ద గ్రేట్ సిటీ..ఏం కావాలన్నా ఈ నగరంలో దొరుకుతాయి. అలాగే డ్రగ్స్ కావాలన్నా దొరుకుతాయి. మీ వయసుతో సంబంధం లేదు.. మీ జెండర్‌తో సంబంధం లేదు.. క్యాష్ కొడితే ఎలాంటి డ్రగ్స్ అయినా క్షణాల్లో మీ చేతిలో ఉంటాయి. లాక్‌డౌన్‌తో కనుమరుగైపోయిందనుకున్న డ్రగ్స్ భూతం…మళ్లీ హైదరాబాద్‌లో హల్చల్ చేస్తోంది. గతంలో లాగా కాకుండా కాస్త డిఫరెంట్‌గా…కొత్త పేర్లు, సరికొత్త మార్గాల్లో నగరానికి తరలివస్తోంది. తమ పంథాను మార్చేసిన ముఠాలు…నగరవాసులను డ్రగ్స్ వైపు మళ్లించేందుకు..మత్తులో ముంచెత్తేలా చేసేందుకు.. ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.
సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని ఒకరు, అమ్మాయిలను ఎరగా వేసి మరొకరు:
అందులో భాగంగానే ఇటీవల సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ డ్రగ్స్‌ను విక్రయించేందుకు ఓ ముఠా ప్రయత్నించి పట్టుబడితే.. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను రప్పించి వారిని ఎరగా వేసి డ్రగ్స్‌ను విక్రయిస్తూ మరో ముఠా పోలీసులకు చిక్కింది. తాజాగా న్యూ ఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ సరఫరా అవుతుందనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు…ముగ్గురు యెమెన్ దేశస్తులతో సహా నలుగురిని అరెస్ట్ చేశారు.
న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్:
పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నా….హైదరాబాద్‌కు గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ సరఫరా అవుతూనే ఉంది. తాజాగా ముగ్గురు యెమన్ దేశస్తులు సహా నలుగురు పట్టుబడ్డారు. వారి నుంచి 30 గ్రాముల MDMA, కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. టోలీచౌకీలో నివాసం ఉంటున్న యెమెన్ దేశస్తులు.. న్యూఇయర్ వేడుకల కోసం డ్రగ్స్ తీసుకొచ్చినట్లుగా గుర్తించారు. డ్రగ్స్ సరఫరాపై పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. అబ్దుల్లా గియాస్, అల్వర్ అలీ, అబ్దుల్ రెహమాన్, సలీంను అరెస్టు చేశారు. గోవా కేంద్రంగా డ్రగ్స్ దందాను నడుపుతున్నట్లు విచారణలో వెల్లడైంది.
సెక్స్ సామర్థ్యం పెరుగుతుందని ప్రచారం:
దీనికి నాలుగు రోజుల క్రితం మరో డ్రగ్స్ ముఠా పోలీసులకు చిక్కింది. ఈ ముఠా…యువతను ఆకర్శించేందుకు…సరికొత్త ప్రచారానికి తెరలేపింది. ఈ డ్రగ్స్ తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుందంటూ విక్రయించే ప్రయత్నం చేసింది. ప్రధానంగా పబ్‌లకు వచ్చే వారిని టార్గెట్ చేసి విక్రయాలు చేస్తున్నట్లు తేలింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు…ముఠా సభ్యులను వెంబడించి మరి పట్టుకున్నారు. ముగ్గురిని అరెస్ట్ చేసి..వారి నుంచి 200 గ్రాముల మత్తు మందు మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ముంబై నుంచి డ్రగ్స్ తీసుకువచ్చినట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ డ్రగ్స్ దందాకు ఓ ప్రముఖ హోటల్లో చెఫ్‌గా పనిచేసిన సలీమ్‌ను సూత్రధారిగా గుర్తించిన పోలీసులు…సలీమ్ కోసం టెలి మార్కెటింగ్ చేస్తున్నముగ్గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఉమెన్ సింగర్ల ద్వారా డ్రగ్స్ వ్యాపారం:
అంతకుముందు పబ్‌లకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సల్మాన్, హైమద్‌ను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు గోవా నుంచి డ్రగ్స్‌ను తీసుకొచ్చి..పబ్‌లలో పనిచేస్తున్న ఉమెన్ సింగర్ల ద్వారా వ్యాపారం చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది. అంతేకాకుండా ఈ ఇద్దరూ కలిసి ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయించి, విటులకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో దాదాపు పది పబ్‌లకు… డ్రగ్స్‌తో పాటు అమ్మాయిలను సరఫరా చేసినట్లుగా తెలుస్తోంది.
3 రోజుల వ్యవధిలో వందకోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం:
ఆగస్టులో కూడా నగరంలో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. మూడు రోజుల వ్యవధిలోనే రెండు చోట్ల వందకోట్లకు పైగా విలువైన మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఫార్మా కంపెనీలో డీఆర్ఐ అధికారులు 52 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలు గుర్తించారు. భూమిలో పట్టుబడ్డ డ్రగ్స్‌ను వెలికితీశారు. ఓ కార్గో బస్సులో తరలిస్తోన్న డ్రగ్స్‌తో పాటు…ఫార్మా కంపెనీలో తయారువుతోన్న మత్తు మందులనూ స్వాధీనం చేసుకున్నారు.
చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరణ:
అయితే ఓ వైపు.. డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపడానికి పోలీసులు ఎంతగా ప్రయత్నం చేసినా… చాప కింద నీరులా డ్రగ్స్ దందా విస్తరిస్తూనే ఉంది. గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి ముఠాలు డ్రగ్స్‌ను సరఫరా చేస్తూనే ఉన్నాయి. నగరవాసులను మత్తులో ముంచేస్తూ…డబ్బులు దండుకుంటూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌కు వస్తున్న డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి? ఎవరికి చేరుతున్నాయి? ఎవరెవరు డ్రగ్స్ వాడుతున్నారు? ఇంకా ఈ ముఠాలోని సభ్యులెవరు? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. న్యూఇయర్ సమీపిస్తుండటంతో డ్రగ్స్ రవాణాపై మరింత నిఘా పెట్టారు.

సంక్రాంతి సెలవులు ముగిశాయి..హైదరాబాద్‌కు ప్రజలు తిరుగుప్రయాణం

దేవాలయాలపై దాడులకు నిరసనగా బీజేపీ యాత్ర

ఏపీలో మరోసారి మోగనున్న బడిగంట..ఇంటర్ కాలేజీలకు వేసవి సెలవులు రద్దు

నేటి నుంచి తెలంగాణలో రెవెన్యూ ట్రిబ్యునల్స్..నెలలోపే సమస్యలు పరిష్కారం
