dubai-hospital-waives-rs-1-5-crore-covid-bill-of-jagtial-worker.1

మానవత్వం బతికే ఉంది, కరోనా చికిత్సకు అయిన కోటి 52లక్షలు బిల్లుని మాఫీ చేసిన ఆసుపత్రి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం కరోనా చికిత్స పేరుతో ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు రోగులను దోచుకుంటున్నాయి. ఒక్కరోజు చికిత్సకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వారం రోజులకు రూ.10 నుంచి 20లక్షలు చార్జి చేస్తున్నాయి. ఒక్కో ఆసుపత్రి ఒక్కో రీతిలో దోపిడీ చేస్తున్నాయి. ఒక్కముక్కలో చెప్పాలంటే కరోనా పేరు చెప్పి అడ్డంగా దోచేస్తున్నాయి కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ఆసుపత్రి యాజమాన్యం పెద్ద మనసు చూపింది. ఇంకా మానవత్వం బతికే ఉందని చాటింది. ఏకంగా కోటి రూపాయల కరోనా చికిత్స బిల్లుని మాఫీ చేసి హ్యాట్సాఫ్ అనిపించుకుంది.

రూ.1.52కోట్ల కరోనా చికిత్స బిల్లు మాఫీ చేసిన ఆసుపత్రి:
దుబాయ్ లోని ఓ ఆసుపత్రి యాజమాన్యం మానవత్వం చాటుకుంది. భారతీయునికి కరోనా చికిత్సకు అయిన కోటి 52లక్షల రూపాయల బిల్లుని మాఫీ చేసింది. అంతేకాదు ఆ వ్యక్తి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు సాయం చేసింది. ఖర్చుల కోసం రూ.10వేలు కూడా ఇచ్చింది.

వివరాల్లోకి వెళితే, జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం వెనుగుమట్లకు చెందిన ఓడ్నాల రాజేష్(12) ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లాడు. ఈ క్రమంలో అతడు కరోనా బారినపడ్డాడు. దీంతో అతడు స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రిలో చేరాడు. ఆసుపత్రి అతడికి కరోనా ట్రీట్ మెంట్ ఇచ్చింది. కరోనా ట్రీట్ మెంట్ కు గాను ఆసుపత్రి యాజమాన్యం రాజేష్ కు ఏకంగా కోటి 52లక్షల రూపాయల బిల్లు వేసింది. దీంతో రాజేష్ అతడి కుటుంబసభ్యులు బిత్తరపోయారు. అంత డబ్బు తమ దగ్గర లేదని చేతులెత్తేశారు. ఏప్రిల్ 2న రాజేష్ కరోనా బారిన పడ్డాడు. 80 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందాడు.

Dubai hospital waives off Rs 1 crore 52 lakh bill for Covid-19 ...

80రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స:
అంత బిల్లు తాము కట్టలేమని రాజేష్, అతడి కుటుంబసభ్యులు వాపోయారు. వారు భారత ఎంబసీ అధికారులను ఆశ్రయించారు. తమ కుటుంబ పరిస్థితిని వివరించి సాయం చేయాలని కోరారు. వారి బాధను విన్న భారత ఎంబసీ అధికారులు సానుకూలంగా స్పందించారు. ఆసుపత్రి యాజమాన్యానికి వెంటనే లేఖ రాశారు. అందులో రాజేష్ ఆర్థిక స్థితిగతులను వివరించారు. పూర్తిగా మానవీయ కోణంలో ఆలోచించి రాజేష్ బిల్లుని మాఫీ చేయాలని లేఖలో కోరారు. కాగా, 80 రోజుల చికిత్స తర్వాత రాజేష్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు.

Hospital in Dubai waives off Rs 1.5 cr coronavirus bill of ...

కోటి 52లక్షల బిల్లు మాఫీ చేసిన ఆసుపత్రి యాజమాన్యం:
రాజేష్ కు ట్రీట్ మెంట్ ఇచ్చిన ఆసుపత్రి పేరు దుబాయ్ హాస్పిటల్. ఏఐ ఖలీజ్ రోడ్డులో ఉంటుంది. భారత ఎంబసీ రాసిన లేఖతో ఆసుపత్రి యాజమాన్యం స్పందించింది. మానవీయ కోణంలో ఆలోచన చేశామని, బిల్లుని మాఫీ చేస్తున్నామని ప్రకటించింది. అంతేకాదు రాజేశ్ కు ఫ్లైట్ టికెట్ తో పాటు ఖర్చుల కోసం రూ.10వేలు ఇచ్చి ఇండియాకు పంపింది ఆసుపత్రి యాజమాన్యం. దీంతో రాజేష్ అతడి కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఆసుపత్రి యాజమాన్యానికి, భారత ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కోటి 52లక్షల బిల్లుని పెద్ద మనసుతో మాఫీ చేసిన దుబాయ్ ఆసుపత్రి యాజమాన్యంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంకా మానవత్వం, మంచితనం బతికే ఉన్నాయని దుబాయ్ ఆసుపత్రి యాజమాన్యం నిరూపించిందని అంతా అంటున్నారు.

READ  ఉగ్రవాదుల పనేనా : నెదర్లాండ్స్ లో కాల్పుల కలకలం..ఒకరు మృతి

Related Posts