లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

అప్పటిలా కుదరవ్ భయ్యా : వాకిట్లో వధూవరులు..కార్లలో కూర్చునే ఆశీర్వాదాలు

Published

on

Dubai variety wedding ceremony : పెళ్లంటే పందిళ్లు.. సందళ్లు..బాజాలు భజంత్రీలు, పట్టు చీరల రెపరెపలు. కానీ ఇది కరోనా టైమ్.ఇవన్నీ నడవవ్ భయ్. అందుకే పెళ్లిళ్లన్నీ సందడి లేకుండానే..బంధుమిత్రులు లేకుండానే జరిగిపోతున్నాయి. పెళ్లికొచ్చినవాళ్లంతా వధూవరులను అక్షింతలు వేసి..పదికాలాల పాటు సుఖ సంతోషాలతో కలిసి మెలిసి ఉండమని ఆశీర్వదించేవారు. కానీ ఇది కరోనా కాలం కదా..అందుకని పెళ్లిళ్లకు బంధుమిత్రులు రాకుండానే అయిపోతున్నాయి. దీంతో వధూవరులకు ఆత్మీయుల ఆశీస్సులు కూడా దక్కటంలేదు.దీంతో కరోనా టైమ్ లో పెళ్లి చేసుకున్న జంటలు వినూత్న రీతిలో వారి వివాహాలను జరుపుకుంటున్నారు. కొంతమంది బంధు మిత్రుల కటౌట్లు పెట్టుకుని..వారంతా తమ పెళ్లికి వచ్చారని తృప్తి పడుతూ పెళ్లిచేసుకుంటూ దుబాయ్ లోని ఓ జంట ఆత్మీయుల ఆశీస్సులో అందుకోవాలనే కోరికతో వినూత్న ఏర్పాట్లు చేశారు. ఎలాగైనా బంధుమిత్రుల ఆశీస్సులతోనే తమ వివాహం జరగాలని అనుకున్నారు.

నటి కుష్బూకు తప్పిన ప్రమాదం.. కారును ఢీకొట్టిన ట్యాంకర్


అసలే దుబాయ్.. నిబంధనలు అతిక్రమిస్తే అంతే సంగతులు. కఠినంగా ఇరుక్కుపోవాల్సిందే. అక్కడి ప్రభుత్వం అంత కఠిన నిబంధనలు పెట్టింది మరి. దీంతో ఆ జంటకు ఓ ఐడియా వచ్చింది. యూఏఈకి చెందిన వరుడు మహమ్మద్ జజెమ్ ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో ఏరోనాటికల్ ఇంజరీనిర్‌గా పనిచేస్తున్నాడు. వధువు అల్మస్ అహ్మద్‌ ఫైనల్ ఇయర్ మెడికల్ కోర్స్ చదువుతోంది.

వీరిద్దరికీ పెద్దలు వివాహం చేయాలని నిశ్చయించారు. బంధుమిత్రులు రాకుండానే వారి పెళ్లికూడా అయిపోయింది. వివాహం అయితే అయ్యిందిగానీ బంధువుల ఆశీర్వాదాలు మాత్రం అందుకోలేకపోయారు. దీంతో వెంటనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు.

డెకరేట్ చేసిన ఓ పూల ఆర్చ్ కింద వధూవరులిద్దరూ చక్కగా ముస్తాబై నిలబడ్డారు. బంధువులంతా తమ తమ కార్లలో వచ్చారు.కానీ కారు మాత్రం దిగకుండానే కార్లలో కూర్చునే నూతన వధూవరులను ఆశీర్వదించి ఓ ఫోటో తీసుకుని వెళ్లిపోయారు. అదర్రా ఈ కరోనా కాలంలో జరిగే వింత వింత పెళ్లిళ్ల కథలో ఇదొక కథ అన్నమాట..కథ అంటే కథకాదు నిజంగా జరిగిందేనండోయ్..

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *