లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Political

నన్నూ బీజేపీని వేరుచేసి చూడొద్దు : దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌.. సెన్సేషనల్ వీడియో

Published

on

Dubbaka Champion MLA Raghunandan : దుబ్బాక.. ఇటీవలే ఉపఎన్నిక జరిగిన నియోజకవర్గం.. తెలంగాణలో పెద్ద హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా మారిపోయింది. అధికార టీఆర్‌ఎస్‌ నియోజకవర్గాన్ని.. బీజేపీ ఈ ఉపఎన్నికలో కైవసం చేసుకుంది.

చివరి రౌండ్ వరకూ ఉత్కంఠగా సాగిన ఈ పోరులో.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించారు. రెండు సార్లు ఓడిపోయినా.. పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడి గెలుపు జెండా ఎగరేశారు.

మెదక్‌ జిల్లాలో అధికార టీఆర్‌ఎస్‌కు తిరుగులేదనుకుంటున్న వేళ.. రఘునందన్ ఈ విజయాన్ని ఎలా సాధించారు? ఆయన విజయ రహస్యమేంటి? ఆయన ఫ్యూచర్‌ ప్లాన్స్ ఏంటి..? దుబ్బాకలో గెలుపు తర్వాత బీజేపీ టార్గెట్‌ ఏంటి..? లాంటి అనేక అంశాలను MLA రఘునందన్‌ 10టీవీ ఎక్స్ క్లూజివ్ లైవ్ షోలో పంచుకున్నారు.దుబ్బాక ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించిన రఘునందన్.. తెలంగాణ బీజేపీలో కీలక నేతగా మారారు. రెండుసార్లు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. మూడోసారి దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దుబ్బాక గెలుపు రఘునందన్ దా? బీజేపీదా? అంటే నన్ను బీజేపీని వేరుచేసి చూడొద్దన్నారు.దుబ్బాకలో గెలుపుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించామన్నారు. తాను ఎన్నికల్లో నిలబడినప్పుడు అందరూ అవహేళన చేశారని చెప్పారు. తాను రెండుసార్లు ఓటమిపాలైన ప్రజలకు అందుబాటులోనే ఉన్నానని తెలిపారు.అందుకే ప్రజలు ఈసారి నన్ను గెలిపించారని రఘునందన్ చెప్పారు. తన గెలుపు కోసం కృషి చేసిన అందరికీ ఈ విజయం అంకితమన్నారు. దుబ్బాకలో విజయవంతో అందరికి కనువిప్పు కలిగిందన్నారు.సానుభూతికి తెలంగాణలో చోటు లేదని గతంలో కేటీఆర్ చెప్పారని, ఖమ్మంలో, నారాయణఖేడ్‌లో సానుభూతి లేదని టీఆర్ఎస్ నేతలు చెప్పారని రఘనందన్ అన్నారు.అక్కడ లేని సింపతి, దుబ్బాకలో ఎలా వస్తుందనుకున్నారని ఆయన ప్రశ్నించారు. దుబ్బాకలో విజయం కచ్చితంగా బీజీపీదేనని రఘునందన్ స్పష్టం చేశారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *