లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Telangana

దుబ్బాక ఎన్నికలు, నేనే అభ్యర్థి అంటున్న ముత్యం రెడ్డి..ఖరారు కాలేదన్న ఉత్తమ్

Published

on

Dubbaka election : నిన్నమొన్నటి వరకు గులాబీ పార్టీలో ఉన్న చెరుకు ముత్యంరెడ్డి తనయుడు శ్రీనివాస్‌రెడ్డి.. ఉప ఎన్నిక ముందు టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ ఇచ్చారు. సస్పెన్స్‌ నడుమ.. సొంత గూటికే చేరుకున్నారు. గాంధీభవన్‌లో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌ తమను అవమానించిందని.. అందుకే కాంగ్రెస్‌లో చేరానని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ అభ్యర్థిని తానేనని.. విజయం తప్పకుండా సాధిస్తానని ఆయన దీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి నినాదంతో ప్రచారంలోకి దిగుతానని తెలిపారు.దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థిని తానేనని శ్రీనివాస్‌రెడ్డి చెబుతుంటే.. పీసీసీ చీఫ్‌ మాత్రం ఇంకా అభ్యర్థి పేరు ఖరారు కాలేదన్నారు. అభ్యర్థి పేరు హైకమాండ్‌ పరిశీలనలతో ఉందని తెలిపారు. 2020, అక్టోబర్ 07వ తేదీ బుధవారం అభ్యర్థి ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎవరైనా కాంగ్రెస్‌ విజయం కోసం నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.అధికార టీఆర్‌ఎస్‌ కూడా ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించింది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకే సీఎం కేసీఆర్‌ టికెట్‌ ఖరారు చేశారు. దుబ్బాక బై ఎలక్షన్‌ బాధ్యత తీసుకున్న ట్రబుల్‌ షూటర్ హరీశ్‌రావు పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతతో భేటీ అయ్యారు. ప్రచారం, ఎలక్షన్‌ క్యాంపెయిన్‌పై చర్చించారు. భారీ మెజార్టీతో సుజాతను గెలిపించుకుంటామని హరీశ్‌రావు దీమా వ్యక్తం చేశారు.తనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినందుకు కేసీఆర్‌కు సోలిపేట సుజాత కృతజ్ఞతలు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకోసం తాను శాయశక్తులా పని చేస్తానని ఆమె హామీనిచ్చారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టారు. గ్రామాల వారీగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లడుగుతున్నారు. మొత్తానికి ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల రంగంలోకి దిగుతుండడంతో.. దుబ్బాక ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారుతోంది.అధికార టీఆర్‌ఎస్‌ కూడా ఉపఎన్నిక ప్రచారంలో దూసుకుపోతోంది. ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించింది. సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతకే సీఎం కేసీఆర్‌ టిక్కెట్‌ ఖరారు చేశారు. దుబ్బాక బై ఎలక్షన్‌ బాధ్యత తీసుకున్న ట్రబుల్‌ షూటర్ హరీశ్‌రావు పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాతతో భేటీ అయ్యారు. ప్రచారం, ఎలక్షన్‌ క్యాంపెయిన్‌పై చర్చించారు.భారీ మెజార్టీతో సుజాతను గెలిపించుకుంటామని హరీశ్‌రావు దీమా వ్యక్తం చేశారు. తనకు ఎమ్మెల్యే టికెట్‌ కేటాయించినందుకు కేసీఆర్‌కు సోలిపేట సుజాత కృతజ్ఞతలు తెలిపారు. రామలింగారెడ్డి ఆశయ సాధనకోసం తాను శాయశక్తులా పనిచేస్తానని ఆమె హామీనిచ్చారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *