లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

గూగుల్ వదిలేసి డక్‌డక్‌గోకు వెళ్లిపోతున్న యూజర్లు!!

Published

on

Duck Duck Go: సోషల్‌ మీడియాల్లో ఇన్నేళ్లుగా నడిచిన ఆధిపత్య ధోరణికి ఇకపై ఫుల్ స్టాప్ పడేలా ఉంది. రొటీన్ లైఫ్‌లో వాట్సాప్‌ వంటి యాప్‌లనే ప్రైవసీ పాలసీ అప్‌డేట్స్‌ కారణంగా పక్కనపెట్టేస్తున్న యూజర్లు.. ప్రైవసీకి పెద్దపీట వేసే ఇంటర్నెట్‌ సాధనాలు, సోషల్‌ మీడియా యాప్‌ల వైపు దృష్టి సారించారు. డేటా ప్రొఫైల్‌ను వినియోగించి వ్యాపారం చేసే సెర్చ్‌ ఇంజిన్లను కాదని ప్రైవసీ అందించే సెర్చ్‌ ఇంజిన్లకు మొగ్గు చూపుతున్నారు. తాజాగా డక్‌డక్‌గో సెర్చ్‌ ఇంజిన్‌కు యూజర్లు పెరుగుతుండడం కొత్త ట్రెండ్‌ను సూచిస్తోంది.

గూగుల్‌కు పోటీ ఉందా?
ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం.. గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో రోజుకు 350 కోట్ల సెర్చ్‌ క్వైరీస్‌ నమోదవుతున్నట్టుగా అంచనా. రోజూ 350 కోట్ల ప్రశ్నలు గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ను పలకరిస్తున్నాయి. సెర్చ్‌ ఇంజిన్ల వాడకంలో 90 శాతం వాటా గూగుల్‌దే. మిగిలిన సెర్చ్‌ ఇంజిన్లు Bing (2.78 శాతం వాటా), Yahoo (1.60 శాతం), Bydu (0.92 శాతం), Yandex (0.85 శాతం), Duck Duck Go (0.50 శాతం) బరిలో ఉన్నాయి.

ఇదే సమయంలో Duck Duck Go సెర్చ్‌ ఇంజిన్‌లో సెర్చింగ్ సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా 10 కోట్ల సెర్చ్‌ క్వైరీస్‌ మైలురాయిని డక్‌డక్‌గో అందుకుంది. ఇందుకు కారణంగా డక్‌డక్‌గో ప్రైవసీకి పెద్దపీట వేస్తుంది. యూజర్ల ఐపీ అడ్రస్‌ వంటివి ఇది సేకరించదు. క్రమంగా పెరుగుతున్న క్వైరీస్‌ సంఖ్యను బట్టి డక్‌డక్‌గోకు ఆదరణ పెరుగుతోందని టెక్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇతర సెర్చ్‌ ఇంజిన్లతో పోలిస్తే డక్ డక్ గో భిన్నం. సెర్చ్‌ క్వైరీల ఆధారంగా యూజర్‌ను ట్రాక్‌ చేసి భారీ అడ్వర్టైజింగ్‌ ఏజెన్సీని కలిగి ఉన్న సెర్చ్‌ ఇంజిన్లు.. అడ్వర్టయిజర్లను ఆకర్షించుకునేందుకు యూజర్ల డేటా వాడుకుంటున్నాయని, డక్‌డక్‌గో వాటికి దూరంగా ఉంటుందని చెబుతోంది. సెర్చ్‌ ఇంజిన్లలో ఇచ్చే క్వైరీ ఆధారంగా థర్డ్‌ పార్టీ సోషల్‌ మీడియా యాప్‌లలో యాడ్స్‌ ప్రత్యక్షమవుతాయని చెబుతోంది.

యూజర్ల ప్రైవసీకి పెద్దపీట వేసేలా తాము బిజినెస్‌ మోడల్‌ను ఉపయోగిస్తున్నామని చెబుతోంది. సాధారణంగా మనం బ్రౌజ్‌ చేసే వెబ్‌సైట్లు మాత్రమే కాకుండా థర్డ్‌ పార్టీ ట్రాకర్లు బ్రౌజింగ్, లొకేషన్, సెర్చ్, కొనుగోళ్ల వివరాలు సేకరించి బిహేవియరల్‌ ప్రొఫైల్‌ను సిద్ధంచేసుకుంటాయి. తద్వారా మనకు వ్యాపార ప్రకటనలు సూచిస్తాయి.

సెర్చ్‌ ఇంజిన్‌లో ఉన్న ప్రైవసీ ఎసెన్షియల్స్‌ను వాడడం వల్ల థర్డ్‌ పార్టీ ట్రాకర్లు పనిచేయవని డక్‌డక్‌గో చెబుతోంది. కేవలం యూజర్లు ఇచ్చే క్వైరీ ఆధారంగా యాడ్‌ చూపిస్తామని అలా చేయడం వల్ల యూజర్‌ బ్రౌజింగ్‌ ఆధారంగా బిహేవిరియల్‌ యాడ్స్‌ ఉండవని చెబుతోంది. ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ నుంచి నిఘా కూడా ఉండదని చెబుతోంది. ఐపీ అడ్రస్‌ను కూడా సేకరించమని కన్ఫామ్ చేస్తుంది. ఇలా యూజర్లు ప్రైవసీకి పెద్దపీట వేసే సోషల్‌ మీడియా యాప్‌ల వైపు మొగ్గుచూపుతుండటం ఇన్నేళ్లుగా ఏకఛత్రాధిపత్యం కొనసాగిస్తున్న టెక్ దిగ్గజాలకు తిప్పలు తప్పవనిపిస్తోంది.