Due To Drivers Negligence School Bus Hits Divider

అదుపుతప్పిన స్కూల్ వ్యాన్… ముగ్గురు విద్యార్ధులు మృతి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్ధులు మరణించారు. స్పాట్ లోనే ఇద్దరు చనిపోయారు. మరో విద్యార్థి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఈ ఘటనలో మరో 20 మంది పిల్లలకు గాయాలయ్యాయి. వారికి ఆస్పత్రి చికిత్స అందిస్తున్నారు. వేములవాడ బస్సు డిపో ఎదురుగా ఉన్న హాస్టల్ లో విద్యార్ధులు భోజనం చేసిన తర్వాత వారిని వాగీశ్వరి స్కూల్ కు తీసుకెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

మృతులను ఒంటేముల గ్రామానికి చెందిన మనస్విని, మనాల గ్రామానికి చెందిన దీక్షిత, రిషిత్ గా గుర్తించారు. స్కూల్ వ్యాన్‌ డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడపటంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Related Tags :

Related Posts :