లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

డాక్టర్‌గా దుర్గామాత.. కరోనాసురుడిని చంపుతున్న ఫొటో వైరల్

Published

on

Durga doctor killing coronasur : నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాతను అనేక రూపాల్లో పూజిస్తుంటారు. సృజనాత్మకంగా అమ్మవారిని రంగుల విగ్రహాలను రూపొందిస్తుంటారు. కొన్ని రోజుల క్రితం దుర్గామాత విగ్రహాన్ని ఓ వలస వచ్చిన తల్లి తన పిల్లలతో కలిసి వెళ్తున్నట్టుగా తయారుచేసిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అలాంటి దుర్గా మాత విగ్రహం మరొకటి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.కరోనా మహమ్మారి వ్యాపించిన పరిస్థితుల్లో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత విగ్రహాన్ని కరోనాసురిడిని చంపేస్తున్నట్టుగా క్రియేట్ చేశారు. ఈ ఫొటోను తిరువనంతపురం ఎంపీ శశీ థరూర్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

ఈ ఫొటోలో దుర్గామాత డాక్టర్ వేషధారణలో వైట్ కోట్ ధరించి ఉంది. ఆమె చేతిలో త్రిశులానికి బదులుగా సీరంజ్ ఉంది.కరోనాసురుడిని వ్యాక్సిన్‌తో చంపతున్నట్టుగా రూపొందించారు. కోల్‌కతాకు చెందిన ఓ క్రియేటర్.. #covid19 థీమ్‌తో దుర్గామాత విగ్రహాన్ని రూపొందించాడు. ఇందులో అమ్మవారు వైరస్ ను అంతం చేస్తున్నట్టుగా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది.వాస్తవానికి ఈ దుర్గామాత ఫొటోలు అక్టోబర్ 18న ఫేస్ బుక్ యూజర్ నిత్యా పాల్ తన అకౌంట్లో నుంచి షేర్ చేశారు. ఈ ఫొటోలకు 71,000 షేర్లు, 8వేలకు పైగా రియాక్షన్లు వచ్చాయి.అక్టోబర్ 19న ఇదే పోస్టులను షేర్ చేయడంతో 13వేల లైక్స్, కామెంట్లు వచ్చాయి. ఈ దుర్గామాత ఫొటోలను అనుకరిస్తూ ఆస్పత్రుల్లో కరోనా పేషెంట్లకు చికిత్స అందిస్తుట్టుగా ఫొటోలను షేర్ చేస్తున్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *