బట్టలిప్పేసి సెల్ఫీలు, ఫొటోలు.. హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రయాణం సేఫేనా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

durgam cheruvu cable bridge : హైదరాబాద్‌ దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జిపై ప్రయాణం సేఫేనా..? ప్రమాదాలకు తీగల వంతెన కేరాఫ్‌గా మారనుందా..? కేబుల్‌ బ్రిడ్జ్‌ను పోకిరీలు అడ్డాగా మార్చుకుంటున్నారా..? వంతెనపై జరుగుతున్న వరుస ఘటనలు ఇలాంటి అనుమానాలకు తావిస్తున్నాయి.

రాత్రి వేళ ఎవరు చూస్తారులే అనే ధీమా:
పోలీసుల ఆదేశాలను పట్టించుకోకుండా కేబుల్ బ్రిడ్జిపై యువకులు నానా హంగామా చేస్తున్నారు. రాత్రి వేళ ఎవరు చూస్తారులే అనే ధీమాతో .. కలర్‌ఫుల్ లైటింగ్‌ మధ్య అర్ధనగ్న ఫోజులిచ్చారు. షర్ట్‌ విప్పి నడిరోడ్డుపై పడుకున్నాడు. మరోకడు అవతలి వైపు సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేశాడు. ఇదంతా సీసీ కెమెరాలో సీన్ టు సీన్ రికార్డయింది.

కేబుల్ బ్రిడ్జిపై అర్థనగ్నంగా ఫొటోలు:
యువకుల వెర్రివేషాలను కమాండ్ కంట్రోల్‌ ద్వారా గమనించిన పోలీసులు.. సౌండ్‌ లేకుండా సైలెంట్‌గా స్పాట్‌కు చేరుకున్నారు. గమనించిన ఓ యువకుడు బట్టలు, చెప్పులు చేతబట్టి పరుగు పెట్టాడు. మరొకరు అక్కడే ఆగిపోగా ఇంకొకరు వంగి వంగి చూస్తూ పారిపోయే ప్రయత్నం చేశాడు. వీరిలో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్తగా అందుబాటులోకి వచ్చిన కేబుల్‌ బ్రిడ్జి నగరవాసుల్ని అహ్లాద పరుస్తుంటే.. కొందరికి మాత్రం ఇలాంటి తలతిక్క వేషాలకు వేదికగా మారింది.

వాహనాలను పట్టించుకోకుండా రోడ్డు మధ్యలో ఫొటోలు:
కొందరైతే ఏకంగా వాహనాలు వస్తున్న సమయంలోనే రోడ్డు మధ్యలోకి వెళ్లి ఫోటోలకు ఫోజులిచ్చారు. స్పీడ్‌గా వస్తున్న వాహనాలను పట్టించుకోకుండా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షలు బేఖాతరు చేస్తూ జనం విచ్చలవిడిగా సెల్ఫీలకు ఎగబడుతున్నారు.

రోడ్డుపై అడ్డంగా నడవడం, గ్రిల్స్ దూకడం, బట్టలు విప్పేయడం:
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై పోకిరీల ఆగడాలు ఆగడం లేదు. వంతెన రోడ్డుపై అడ్డంగా నడవడం, గ్రిల్స్ ఎక్కిదూకడం వంటివి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు ఇప్పటికే హెచ్చరించారు. ఇప్పటికే అలా చేసిన వారికి పోలీసులు చలానాలు వేశారు. రోడ్డుపై వాహనాలు ఆపి తిరుగుతున్న వారిని సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు. పోలీసులు ఎంత కట్టడి చేస్తున్నా పోకిరీల్లో మార్పు రావడం లేదు. బుధవారం(అక్టోబర్ 7,2020) రాత్రి కూడా ఇద్దరు వ్యక్తులు హల్ చల్ చేశారు. అర్ధరాత్రి వీరిలో ఓ వ్యక్తి బట్టలు విప్పేసి నడిరోడ్డుపై పడుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. అతని ఒంటిపై షార్ట్ మాత్రమే ఉంది.

షర్ట్ ఇప్పేసి కాళ్లూ, చేతులూ చాపి పడుకుని:
విద్యుత్ వెలుగులతో మెరిసిపోతున్న రోడ్డు నడి మధ్యలో కాళ్లూ, చేతులూ చాపి పడుకొని ఫోటోలకు ఫోజులిచ్చాడు. మరో వ్యక్తి ఫోటోలు తీస్తుండగా.. పెట్రోలింగ్ పోలీసులు వారి దగ్గర కారు ఆపారు. ఇది గమనించిన రోడ్డుపై పడుకున్న వ్యక్తి తన బట్టలను తీసుకొని పరిగెత్తాడు.

READ  గుడిలో ఆత్మహత్య చేసుకుంటానని మహిళ హల్ చల్

పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు లేదు:
కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి ట్రాఫిక్‌ పోలీసులు పదే పదే హెచ్చరిస్తున్నా కొందరు తీరు మార్చుకోవడం లేదు. ఇలాంటి ఘటనలను సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. ప్రత్యేక పెట్రోలింగ్‌తో బ్రిడ్జిపై గట్టి నిఘా పెట్టారు. బ్రిడ్జిపై వాహనాలను నిలిపినా, సెల్ఫీలు దిగినా భారీ జరిమానా తప్పదని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

విద్యుత్ కాంతుల్లో మెరిసిపోతున్న కేబుల్ బ్రిడ్జి:
దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. దీంతో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. మరోవైపు కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు నుంచే టూరిస్ట్ స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం దాటాక విద్యుత్ కాంతుల్లో కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.

టూరిస్ట్ స్పాట్ గా కేబుల్ బ్రిడ్జి:
దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలు తీరాయి. మరోవైపు కేబుల్ బ్రిడ్జి ప్రారంభానికి ముందు నుంచే టూరిస్ట్ స్పాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యల్లో సందర్శకులు వస్తున్నారు. ముఖ్యంగా సాయంత్రం దాటాక విద్యుత్ కాంతుల్లో కేబుల్ బ్రిడ్జి అందాలను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కొందరు మాత్రం సెల్ఫీలు, ఫొటోల కోసం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కొందరు పోకిరీలు బ్రిడ్జిపై వెళ్తున్న వాహనాల రాకపోకలను కూడా పట్టించుకోకుండా రోడ్డకు అడ్డంగా నిలబడి ఫొటోలు దిగుతున్నారు.

Related Posts