ఆహా అనిపిస్తున్న దుర్గం చెరువు కేబుల్ బిడ్జి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్‌ దుర్గం చెరువు బ్రిడ్జి నిర్మాణ పనులు దాదాపు పూర్తయ్యాయి. కేబుల్ బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్ర అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ముఖ్యమైన అంశం అన్నారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో 60శాతానికి పైగా ఖర్చుచేస్తోందని చెప్పారు.


తీగల వంతెన నిర్మించిన ఇంజనీర్లకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. రాత్రి వేళ విద్యుత్ దీపాలతో వెలుగుతున్న దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ డ్రోన్ విజువల్స్‌ను ట్విట్ట్‌ర్‌లో పోస్ట్ చేశారు.

ఎగ్గొడితే ఊరుకోం..GST బకాయిలు చెల్లించాల్సిందే.. కేంద్రంపై హరీష్ రావు సీరియస్


భారతదేశంలోనే అతిపెద్ద కేబుల్‌ బ్రిడ్జిగా నిర్మితమయ్యింది. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువు వంతెనను నిర్మిస్తోంది. 754.38 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. మాదాపూర్, జూబ్లీహిల్స్ మధ్య దూరం గణనీయంగా తగ్గనున్నది.

Related Posts