Dus Bahane 2.0 Making- Baaghi 3

300 మంది డ్యాన్సర్లు – ఎముకలు కొరికే చలిలో..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘బాఘీ 3’ – ‘దస్ బహానే 2.O’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్..

‘బాఘీ’, ‘బాఘీ 2’ సినిమాలు బాలీవుడ్ యంగ్ హీరో టైగర్ ష్రాఫ్ కెరీర్‌ని మలుపు తిప్పాయి. ‘బాఘీ’ ఫ్రాంచైజీలో భాగంగా ‘బాఘీ 3’ రానున్న సంగతి తెలిసిందే. టైగర్ ష్రాఫ్, రితేశ్ దేశ్‌ముఖ్, శ్రద్ధా కపూర్, అంకిత లోఖండే ప్రధాన పాత్రధారులు..

అహ్మద్ ఖాన్ దర్శకత్వంలో ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో సాజిద్ నడియాడ్‌వాలా గ్రాండ్ సన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై సాజిద్ నడియాడ్‌వాలా నిర్మించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్.. ‘బాఘీ 3’.. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

 

తాజాగా ఈ సినిమాలోని ‘దస్ బహానే 2.O’ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఎముకలు కొరికే చలిలో 300మంది డ్యాన్సర్లతో టైగర్, శ్రద్ధాలపై ఈ పాటను బ్యూటిఫుల్‌గా చిత్రీకరించారు. విపరీతమైన చలిని సైతం లెక్కచేయకుండా మూవీ టీమ్ ఈ సాంగ్ పిక్చరైజ్ చేశారు. ‘బాఘీ 3’ చిత్రాన్ని మార్చి 6న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది.

Baaghi 3

Related Posts