dwarf man posts ad for bride in whats app

వాట్సప్ ద్వారా పెళ్లి చేసుకున్న మరుగుజ్జులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అన్ని అవయవాలు సక్రమంగా ఉండి మంచి జీతం, హోదా ఉన్న అబ్బాయిలకే ఈ రోజుల్లో పెళ్ళి కావట్లేదని వారి తల్లితండ్రులు వాపోతున్నారు. కానీ  ఒక మరుగుజ్జు వ్యక్తి వాట్సప్ లో తన వివరాలు పెట్టి తద్వారా తన హైట్ కు తగిన వధువు మెడలో మూడు ముళ్లువేశాడు.

నారాయణపేట్ జిల్లా అచ్చంపేటకు చెందిన మున్నా జన్యులోపాలతో పుట్టాడు. తన వయస్సు పెరుగుతున్నా అందుకు తగ్గట్టు అతని శరీరం పెరగక 3 అడుగుల వద్దే ఆగిపోయింది. అతనికి పెళ్లీడు వచ్చింది. తాను పెళ్లి చేసుకోవాలంటే తన లాంటి యువతినే పెళ్లి చేసుకుంటే సమస్య ఉండదని భావించి తన ఫోటో, ప్రోఫైల్ ను  వధువు కావలెను అంటూ వాట్సప్ గ్రూపుల్లో పోస్ట్ చేశాడు. ఆ ప్రోఫైల్ అటు తిరిగి ఇటు తిరిగి నారాయణపేట మండలం తిర్మలాపూర్ కు చెందిన ఒక వ్యక్తి వద్దకు చేరింది.

ఆవ్యక్తి వెంటనే అదే గ్రామంలో ఉన్న బసప్ప కుమార్తె భాగ్యమ్మకు చూపించాడు. భాగ్యమ్మకూడా జన్యులోపాలతో జన్మించి ఎత్తుపెరగకుండా మరుగుజ్జు లాగానే ఉంది. ఆమెకు మున్నా నచ్చటంతో ప్రోఫైల్ లోని ఫోన్ ఆధారంగా సంప్రదింపులు జరిపారు.  వాట్సప్  వీడియో కాల్ లోనే పెళ్లి చూపులు కానిచ్చారు. వధూవరులిద్దరికీ, పెద్దలకు నచ్చటంతో గురువారం జూన్ 25 న తిర్మల్ దేవుడి గుడిలో వివాహం నిరాడంబరంగా జరిపించారు. 

Read: వెల్ నెస్ సెంటర్ పేరుతో వ్యభిచారం : ఆరుగురి అరెస్ట్

Related Posts