డ్వేన్ జాన్సన్ (the rock) కు కరోనా పాజిటివ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభిమానులతో ముద్దుగా ‘ది రాక్’ అని పిలిపించుకునే డ్వేన్ జాన్సన్ కరోనా బారిన పడ్డారు. వాల్డ్ ఫేమస్ ఫైటర్ రాక్ గురించి తెలియనివారుండరు. రింగ్ ను ఓ ఊపు ఊపిన జాన్సన్.. ఆ తరువాత హాలీవుడ్ సినిమాల్లో అద్భుతంగా రాణించాడు. కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు 48 ఏళ్ళ ఈ స్టార్ ఇన్ స్ట్రాగ్రామ్ లో వెల్లడించాడు.wife, Lauren Hashian, daughters Jasmine, 4, and Tiana, 2 వైరస్ కారణంగా అనారోగ్యానికి గురయ్యారని తెలిపాడు. ఇప్పుడు వారి ఆరోగ్యం బాగానే ఉందన్నాడు. క్రమశిక్షణతో మెలగాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని సూచించాడు. ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇతరుల పట్ల..జాగ్రత్తగా ఉండాలన్నాడు. వైరస్ నుంచి తన కుటుంబాన్ని కాపాడుకొనేందుకు, ఇతరులను రక్షించడం అత్యంత ప్రాధాన్యతనిస్తానన్నాడు. తనకు మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చిందని, అయినా..ఆరోగ్యవంతంగానే ఉన్నట్లు వెల్లడించాడు.

వైరస్ నుంచి తన పిల్లలు తొందరగానే కోలుకున్నారని, తొలుత వారికి గొంతు సంబంధించిన సమస్యలు వచ్చాయన్నారు. ప్రస్తుతం వీరు సంతోషంగా ఆడుకుంటున్నారని తెలిపారు. తన స్నేహితుల్లో కొంతమంది తల్లిదండ్రులు కోల్పోయారన్నారు. కోవిడ్ వైరస్ ను కట్టడికి ప్రజలు సహకరించాలని, ఇతరులతో మాట్లాడే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, నెలల తరబడి నిర్భందంలో ఉన్నామన్నారు. ఊపిరితిత్తుల సమస్యల కారణంగా మాస్క్ లు ధరించడం లేదని, తన తల్లికి ఊపిరితిత్తుల సమస్య నుంచి బయటపడినా..ఇప్పటికీ మాస్క్ ధరించడం జరుగుతోందన్నారు.

అమ్మ త్యాగానికి మరిచిపోలేని సత్కారం


ఇక్కడ రాజకీయాలతో సంబంధం లేదని, తప్పనిసరిగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, మీరు ఏ వ్యక్తి, ఎలాంటి వారు తదితర విషయాలను తాను పట్టించుకోనన్నారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని విడుదల చేసిన వీడియోలో అభిమానులకు, ప్రజలకు సూచించారాయన.Related Tags :

Related Posts :