గేదెలు, ఆవులకు ఆధార్ కార్డు..ఉపయోగాలేమిటంటే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

‘ఆధార్’ కార్డు అన్నింటికీ ఇదే ఆధార్. భారతీయ పౌరులు ప్రతి ఒక్కరికీ ఆధార్ కార్డు ఉంటుంది. ఉండాల్సిందే అనే రూల్ తో ప్రతీ ఒక్కరూ ఆధార్ కార్డులను పొందారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా ఆధార్ కార్డు పొందొచ్చు. అన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయటంతో ఆధార్ ప్రతీ భారతీయుడికి కీలకంగా మారింది. ఏ సంక్షేమ పథకాలు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి అయ్యింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల లబ్ది పొందాలంటే ఆధార్ అంత్యం కీలకం.భారతీయుల జీవితాల్లో ఆధార్ భాగమైపోమింది. ప్రతీదానికి ఆధార్ ఐడెంటికీ కార్డుగా మారిపోయింది.


ఆధార్ కార్డు కేవలం మనుషులకు మాత్రమే కాదు.. ఇప్పుడు భారతదేశంలోని పశువులకు కూడా ఆధార్ కార్డులు ఉండాలంటోంది మోదీ ప్రభుత్వం. ఆవులు, గేదెలు వంటి పశువులకు కూడా ఆధార్ కార్డులు జారీ చేస్తోంది. అసలు వీటికి ఎందుకు ఆధార్ కార్డులు అనే అనుమానం వస్తుంది. దీని వల్ల ఉపయోగమేంటి అనికూడా అనుకోవచ్చు..


వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు.. అడ్వాన్స్‌డ్ సెర్చ్ .. చాట్ రూమ్స్, కొత్త ఐకాన్లు


ప్రతీ రైతు ఆదాయాలు పెంచుకోవాలని.. తద్వారా దేశ ఆర్థిక స్థితి కూడా మెరుగుపడాలనే భుత్వం రైతుల ఆదాయం పెంచాలని మోడీ సర్కార్ ఆలోచిస్తుంది. దీంట్లో భాగంగానే పశువులకు ఆధార్ కార్డులు అందిస్తోంది. ఆదాయానికి ఆధార్ కార్డుకు సంబంధమేంటి..దాని వల్ల ఉపయోగాలేంటి అనుకోవచ్చు.


ఆవులు, గేదెలకు ఆధార్ నెంబర్ ఇస్తే.. ఈ నెంబర్‌ సాయంతో ఆ ఆవు, గేదే ఏ జాతికి చెందింది? దారి బ్రీడ్ ఏంటి? దాని ఆరోగ్యం ఎలా ఉంది? అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది,? ఆ పశువుకు సంబంధించిన యజమని ఎవరు? ఆ యా పశువులకు ఏమైనా వ్యాక్సిన్లు వాడుతున్నారా? వంటి పలు కీలక అంశాలపై స్పష్టత వస్తుంది. తద్వారా వాటి ఆరోగ్య పరిరక్షణతో పాటు పలు ఉపయోగాలు పొందవచ్చు.

అంతేకాదు..దేశంలో పశు సంపద ఎంత ఉంది? పాడిపరిశ్రమపై ఆయా రైతులు ఆదాయం పొందుతున్నారా? వంటి పూర్తి సమచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా మోదీ సర్కార్ ఇటీవలనే ఇగోపాల యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్‌లో కూడా పశు ఆధార్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అంటే మీరు ఇంట్లో కూర్చొని మీ గేదెలు లేదా ఆవుల వివరాలు తెలుసుకోవచ్చన్నమాట.


అంతేకాదు..ఎక్కడో దూరాన్న ఉండికూడా ఇగోపాల యాప్ ద్వారా పశువులను కొనుక్కోవచ్చు. అమ్ముకోవచ్చు. మీ పశువులను అమ్మాలనుకుంటే వాటిని పశువుల సంతలకు తోలుకెళ్లి రోజుల తరబడి అక్కడే సమయాన్ని వృధా చేసుకోనవసరం లేదు. ‘ఇగోపాల’ యాప్ లో మీ అమ్మాలనుకుంటున్న పశువుల వివరాలు పెట్టవచ్చు..అలాగే కొనాలనుకుంటున్న వివరాలు..అంటే మీకు ఎటువంటి పశువు కావాలి? అనే వివరాలను పెట్టవచ్చు.


అలా జరగాలంటే ఆవు లేదా గేదె పూర్తి వివరాలు అందుబాటులో ఉండాలి. దీని కోసం ఆవు, గేదె ఆధార్ నెంబర్ ఉంటే వాటిని సంబంధించిన పూర్తి వివరాలు కొనుగోలుదారులకు కూడా లభిస్తాయి. ఇంకా యాప్ ద్వారా పశువులకు వ్యాక్సిన్ సదుపాయం పొందొచ్చు. అందుకే గేదెలకు..ఆవులకు కూడా ఆధార్ కార్డులు అవసరమంటోంది ప్రధాని మోడీ ప్రభుత్వం.

READ  సంక్షోభంలో కమల్‌నాథ్ సర్కార్.. రాజీనామా ప్రకటించిన 22 మంది మంత్రులు

Related Posts