లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

పెట్టుకోండి : ఏపీ కేబినెట్ కు ఈసీ గ్రీన్ సిగ్నల్

అందులో భాగంగా మే 13వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Published

on

EC gives Permission to Conduct AP Cabinet Meeting

అందులో భాగంగా మే 13వ తేదీ సోమవారం సాయంత్రం ఈసీ అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కోడ్ ఉన్నందున ఈసీ ఆదేశాలతో భేటీ అవుతున్నారు ఏపీ మినిస్టర్స్. మంగళవారం(మే-14,2019) ఉదయం 10:30 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది.  ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. కేబినెట్ భేటీకి సంబంధించి అనుమతి కోసం రెండు రోజుల క్రితం ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈసీకి లేఖ రాశారు. దీనిపై 48 గంటల్లో ఈసీ తన నిర్ణయం వెల్లడించాల్సి ఉంది ఇందులో భాగంగానే సోమవారం(మే-13,2019) సాయంత్రం ఏపీ కేబినెట్ భేటీకి అనుమతి ఇస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

కేబినెట్ భేటీలో రాష్ట్రంలోని కరువు పరిస్థితులు, ఫొనీ తుఫాన్ ప్రభావానికి నష్టపోయిన వారికి పరిహారం, ఇతర సాయం అందించే విషయంలోనూ కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలోని చాలా ప్రాంతాల్లో ఏర్పడిన మంచినీటి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపైనా కేబినెట్ లో మంత్రులు చర్చించనున్నారు. 

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *