Economic slowdown? BJP’s income grows by whopping 135 percent to Rs 2410 crore

ICUలో ఎకానమీ.. బీజేపీకి కాసుల వర్షం : ఆదాయం@రూ.2,410 కోట్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ‘మహా మందగమనం’ పరిస్థితులు ఉన్నాయి. ఇదీ… మాజీ ఆర్థిక

దేశ ఆర్థిక వ్యవస్థ ఐసీయూలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం ‘మహా మందగమనం’ పరిస్థితులు ఉన్నాయి. ఇదీ… మాజీ ఆర్థిక సలహాదారులు, ప్రముఖ ఆర్థికవేత్తల ఆందోళన. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కానీ.. రాజకీయ పార్టీల ఆదాయంపై ఏ మాత్రం ప్రభావం లేదు. పార్టీలపై కనక వర్షం కురిసింది. విరాళాలు వెల్లువెత్తాయి. పార్టీల ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా బీజేపీ ఇన్ కమ్ ఊహకు అందని రీతిలో పెరిగింది.

బీజేపీ ఇన్ కమ్ ఏకంగా 135శాతంకు పెరిగి రూ.2410 కోట్లకు చేరింది. గత ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయం, ఖర్చుల వివరాలను ఎలక్షన్ కమిషన్‌కు బీజేపీ సమర్పించింది. ఆ పార్టీ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం ఆదాయం 135 శాతం పెరిగింది. 2018-19 ఆర్ధిక సంవత్సరంలో మొత్తం రూ.2,410 కోట్ల ఆదాయం సమకూరినట్టు తెలిపింది. 2017-18 ఆర్ధిక సంవత్సరంలో బీజేపీ ఆదాయం రూ.1,027 కోట్లుగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరంలో సమకూరిన మొత్తం ఆదాయంలో రూ.1,450 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చినట్టు పేర్కొంది. ఇదే 2017-18లో మాత్రం రూ.210 కోట్లు మాత్రమే ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా వచ్చింది.

అలాగే, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1,005 కోట్లు ఖర్చు చేసినట్టు బీజేపీ తెలిపింది. 2017-18తో పోలిస్తే ఈ ఖర్చులు 32 శాతం ఎక్కువ. 2017-18లో రూ.758 కోట్లు, 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.792 కోట్లు ఖర్చు పెట్టింది బీజేపీ. ఈ మొత్తాన్ని ఎన్నికలు, సాధారణ ప్రచారం కోసం వినియోగించినట్టు బీజేపీ వివరించింది.  

ఇక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఆదాయం(2018-19) కేవలం రూ.918 కోట్లు. కాగా, 2017-18తో పోల్చితే ఇది 4 రెట్లు(316శాతం) అధికం కావడం విశేషం. 2017-18లో కాంగ్రెస్ ఇన్ కమ్ రూ.199 కోట్లు. ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా 2017-18లో కేవలం రూ.5 కోట్లు మాత్రమే కాంగ్రెస్ కి విరాళంగా రాగా.. 2018-19లో ఇది రూ.383 కోట్లుగా ఉంది. 2019-19 ఆర్థిక సంవత్సరంలో కాంగ్రెస్ ఖర్చులు రూ.309 కోట్లు.

గడిచిన ఐదేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆదాయం గణనీయంగా పడిపోయినా, సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం భారీగా ఖర్చుచేసింది. లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, సిక్కిమ్ అసెంబ్లీల ఎన్నికల్లో మొత్తం రూ.820 కోట్లు ఖర్చుచేసినట్టు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన నివేదికలో కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం రూ.516 కోట్లను ఖర్చు చేయగా, ఈ సారి దాదాపు రూ.300 కోట్లు ఖర్చు చేసింది. పార్టీ ఎన్నికల ప్రచారానికి రూ.626.3 కోట్లు, అభ్యర్థుల కోసం రూ.193.9 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపింది.

READ  యుద్ధ పైలెట్స్ కు మా సెల్యూట్

ఎన్నికల షెడ్యూల్ వెలువడి ప్రక్రియ పూర్తయినంత వరకు మొత్తం రూ.856 కోట్లు ఖర్చయ్యింది. ఎన్నికల ప్రచారానికి చేసిన రూ.626 కోట్లలో రూ.573 కోట్లు చెక్కు రూపంలోనూ, రూ.14.33 నగదు రూపంలో చెల్లించింది. కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర కార్యాలయాలు మీడియా ప్రచారం, ప్రకటనల కోసం రూ.356 కోట్లు ఖర్చయ్యాయి. పోస్టర్స్, ఎన్నికల ప్రచార సామాగ్రి కోసం రూ.47 కోట్లు, స్టార్ క్యాంపెయినర్స్ ప్రచారానికి రూ.85.82 కోట్లు ఖర్చయినట్టు వివరించింది. 

పార్టీల ఆర్థిక వివరాలు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఆయా రాజకీయ పార్టీలు ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే రెండు జాతీయ పార్టీలకు(కాంగ్రెస్, బీజేపీ) అత్యధిక ఆదాయం ఎలక్టోరల్ బాండ్ల నుంచే వచ్చింది. ఇక 2018-19కి సంబంధించి అన్ని రాజకీయ పార్టీల వార్షిక ఆదాయంను ఎన్నికల సంఘం తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపర్చింది. అన్ని రాజకీయ పార్టీల ఆదాయాలు కలిపితే అది ఒక్క బీజేపీ ఆదాయం రూ.2410 కోట్లతో సమానం కావడం విశేషం. ఖర్చుల విషయంలో కూడా ఇతర పార్టీల కంటే బీజేపీనే 39 శాతం అధికంగా పార్టీ నిధులను ఖర్చు చేసింది. 

* గణనీయంగా పెరిగిన బీజేపీ ఆదాయం
* 135శాతం పెరిగిన బీజేపీ ఇన్ కమ్
* 2018-19లో రూ.2,410 కోట్ల ఆదాయం
* 2017-18లో రూ.1,027 కోట్ల ఆదాయం
* ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి అందిన విరాళం రూ.1,450 కోట్లు..60శాతం అధికం

* 2017-18తో పోలిస్తే 2018-19లో పెరిగిన కాంగ్రెస్ ఆదాయం(361శాతం అధికం)
* 2018-19లో కాంగ్రెస్ ఇన్ కమ్ రూ.918 కోట్లు
* 2017-18లో కాంగ్రెస్ ఇన్ కమ్ రూ.199 కోట్లు
* 2018-19లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కి అందిన విరాళం రూ.383 కోట్లు
* 2017-18లో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కాంగ్రెస్ కి అందిన విరాళం రూ.5 కోట్లు

Also Read : మహిళా ఉద్యోగితో ఫోన్‌లో సరసాలు: అడ్డంగా బుక్కైన ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ

Related Posts