లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శికి సమన్లు జారీ చేసిన ఈడీ

Published

on

ED summons Kerala CM’s private secretary in gold smuggling case : కేరళలో సంచలనం కలిగించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సీఎం పినరయ్ విజయన్ వ్యక్తిగత కార్యదర్శి సీఎంరవీంద్రన్ కు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం మరోసారినోటీసులు జారీ చేసింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసుకు సంబంధించి కొచ్చిలోని తమ కార్యాలయంలో డిసెంబర్ 10న విచారణకు హాజరవ్వాలని అదికారులు ఆదేశించారు. రవీంద్రన్ కు ఈడీ నోటీసులు జారీ చేయటం ఇది మూడవ సారి. అదే రోజు రాష్ట్రంలో స్ధానిక సంస్ధలకు రెండోదశ పోలింగ్ జరగునుంది.

అంతకు ముందు నవంబర్ లో, ఈడీ రెండు నోటీసులు పంపగా ఆ సమయంలో రవీంద్రన్ కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయినందున, మరోసారి అనారోగ్య కారణాల వలన హాజరు కాలేదు. దీంతో అధికారులు ఈరోజు తాజాగా నోటీసులు జారీ చేశారు. దౌత్య మార్గాల ద్వారా రాష్ట్రంలోకి అక్రమంగా బంగారం తరలించడంపై నమోదైన ఈ కేసులో ఈడీ, ఎన్ఐఏ, కస్టమ్స్ అధికారులు ప్రస్తుతం విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు.జూలై 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ ‘‘దౌత్య సంబంధిత’’ బ్యాగులో రూ.15 కోట్ల విలువైన 30 కిలోల బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. కాగా…. బంగారం స్మగ్లింగ్ కేసు నిందితులు స్వప్నా సురేష్, సరితా పీఎస్ లను ఆర్ధికనేరాల చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు డిసెంబర్ 8వరకు పోలీసు కస్టడీకి అనుమతి ఇచ్చింది.వీసా స్టాంపింగ్, సర్టిఫికెట్ ధృవీకరణ వంటి విషయాల కోసం రవీంద్రన్ స్వప్నాసురేష్ ను సంప్రదించేవాడు. ఈడీ వర్గాల సమాచారం మేరకు రవీంద్రన్, స్వప్నాసురేష్ ల   మధ్య జరిగిన సంభాషణలు అధికారిక ప్రయోజనాలకోసం కూడా ఉన్నాయా? అనే కోణంలో విచారించబోతున్నారు.లైఫ్ మిషన్, కెఎఫ్‌ఎన్ వంటి ప్రాజెక్టులతో సహా రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రధాన ప్రాజెక్టుల వివరాలను ఇడి ఇంతకు ముందు కోరింది. రవీంద్రన్‌ను ప్రశ్నించడం వల్ల ప్రాజెక్టులను కూడా కవర్ చేసే అవకాశం ఉంది. యుఎఇ మాజీ కాన్సుల్ జనరల్ యొక్క గన్ మెన్ ఎస్ఆర్ జయగోష్ ను శుక్రవారం కస్టమ్స్ అధికారులు ప్రశ్నించారు. కాన్సులేట్ వద్ద డ్రైవర్‌గా ఉన్న సిద్దిక్ అనే మరో వ్యక్తిని కూడా కస్టమ్స్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిపాయి. బంగారు అక్రమ రవాణా తెరపైకి రావడంతో జయగోష్ ఇంతకు ముందు ఆత్మహత్యాయత్నం చేశారు.

కరెన్సీ స్మగ్లింగ్ కేసులో పాల్గొన్న విదేశీ పౌరులపై స్వాప్నా సురేష్, సరిత్ పిఎస్ ఆరోపణలు చేశారని కోర్టులో కస్టమ్స్ అధికారులు సమర్పించిన అఫిఢవిట్ లో పేర్కోన్నారు. ఈ నేపధ్యంలో భారతదేశంలో వారు గడిపిన సమయంలో విదేశీ పౌరులు కలిసిన వ్యక్తులను కస్టమ్స్ గుర్తించి, దర్యాప్తు చేస్తోంది. వారితో పాటు కాన్సులేట్ సిబ్బందిని కూడా ప్రశ్నించడం దీనికి సంబంధం కలిగి ఉంటుంది. కరెన్సీ అక్రమ రవాణాలో ఎక్కువ మంది వ్యక్తులు పాల్గొన్నారని కస్టమ్స్ అనుమానిస్తోంది.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *