10th క్లాస్ ఎగ్జామ్స్ : ఒక్క నిమిషం నిబంధ‌న ఎత్తివేత‌..

  • Published By: madhu ,Published On : March 13, 2019 / 02:46 AM IST
10th క్లాస్ ఎగ్జామ్స్ : ఒక్క నిమిషం నిబంధ‌న ఎత్తివేత‌..

10th క్లాస్ స్టూడెంట్స్‌కి గుడ్ న్యూస్. ఇప్పటి వరకు ఎంతో కఠిన నిబంధనగా ఉన్న ‘ఒక్క నిమిషం’ నిబంధనను అధికారులు ఎత్తివేశారు. నిమిషం లేటయితే పరీక్షా కేంద్రాల్లోకి స్టూడెంట్స్‌ని అనుమతించడం లేదనే సంగతి తెలిసిందే. ఎన్నో పరీక్షలకు ఈ నిబంధనను అధికారులు అమలు పెడుతున్నారు. దీనివల్ల అమూల్యమైన విద్యా సంవత్సరాన్ని కోల్పోయిన స్టూడెంట్స్ ఉన్నారు. దీనిపై విద్యాశాఖాధికారులు సమీక్షించి.. నిబంధనను ఎత్తివేశారు. అలా అని ఎప్పుడుపడితే అప్పుడు ఎగ్జామ్ కు వస్తామంటే కుదరదు. ఐదు నిమిషాల వరకు అనుమతి ఇస్తారు. 
Read Also : దేవడా : ఓటర్ల లిస్టులో బాహుబలి, ఇడ్లీ, సెక్స్, నిట్

10వ తరగతి ఎగ్జామ్స్ మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నాయి. పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి బి.వెంటకనర్సమ్మ వెల్లడించారు. ఒక్క నిమిషం నిబంధన వర్తించదని, అయిదు నిమిషాల వరకు పరీక్ష కేంద్రాల్లోకి అనుమతినిస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాల్లో 306 పరీక్షా కేంద్రాలున్నాయని, 69,225 రెగ్యులర్, 57 కేంద్రాల్లో గత పరీక్షల్లో పాస్ కాని 12,560 మంది పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. 

విద్యార్థులు..సిబ్బందికి సూచనలు : 

  • ఎగ్జామ్స్ సెంటర్స్‌కు విద్యార్థులు, పరీక్ష సిబ్బంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకరావద్దు.
  • పరీక్ష కేంద్రాన్ని విద్యార్థులు ఒక రోజు ముందేగానే చూసుకోవాలి. 
  • విద్యార్థులు హాల్ టికెట్, పెన్, పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ తీసుకొచ్చుకోవాలి. 
  • పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకుంటే బెటర్.