Pnb Jobs : పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 145 పోస్టుల భర్తీ

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22, 2022 నుండి ప్రారంభమవుతుంది.

Pnb Jobs : పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో 145 పోస్టుల భర్తీ

Pnb Jobs

Pnb Jobs : పంజాబ్ నేషనల్ బ్యాంక్ న్యూదిల్లీ ప్రధాన కేంద్రంగా ఖాళీ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్టుల ఖాళీలకు సంబంధించి మేనేజర్లు(రిస్క్) 40, మేనేజర్లు (క్రెడిట్)100, సీనియరల్ మేనేజర్లు(ట్రెజరీ)5 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టులను అనుసరించి సీఏ, సీఎంఏ లేదా గ్రాడ్యుయేషన్ , తత్సమాన పీజీ డిగ్రీ (ఫైనాన్స్) ఉత్తీర్ణత , పనిలో అనుభవం కలిగి ఉండాలి.

అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 22, 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేది మే 7, 2022గా నిర్ణయించారు. పరీక్షను జూన్ 12 , 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ : WWW.pnbindia.in/పరిశీలించగలరు.