NIT Warangal లో ర్యాగింగ్.. ఐదుగురు సస్పెన్షన్

ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

  • Published By: madhu ,Published On : March 29, 2019 / 04:35 AM IST
NIT Warangal లో ర్యాగింగ్.. ఐదుగురు సస్పెన్షన్

ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి.

ర్యాగింగ్ భూతం మళ్లీ భయపెడుతోంది. అనేక మంది విద్యార్థుల బంగారు భవిష్యత్‌ను నాశనం చేస్తోంది. కొన్ని చోట్ల విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా వరంగల్ నిట్‌లో ర్యాగింగ్ ఘటన కలకలం రేపుతోంది. వరంగల్ జాతీయ సాంకేతిక సంస్థ (NIT) క్యాంపస్‌లో బిటెక్ చదువుతున్న ఐదుగురు విద్యార్థులు ర్యాగింగ్ పాల్పడుతున్నారని జూనియర్ స్టూడెంట్స్ కంప్లయింట్ చేశారు. అధికారులు దీనిపై విచారించారు. 
Read Also : లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ రివ్యూ

పది రోజుల క్రితం కొంతమంది విద్యార్థులు నిట్ అధికారులకు ర్యాగింగ్ విషయంపై ఫిర్యాదు చేయడంతో అధికారులు విచారణ కమిటీని వేశారు. కాజీపేట పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ విషయం ఎక్కడా పొక్కకుండా అధికారులు గోప్యత పాటించారు.

విచారణలో BTech మూడో సంవత్సరం చదువుతున్న ముగ్గురు, లాస్ట్ సంవత్సరం చదువుతున్న ఇద్దరు కారణమని తేలింది. వీరిపై వేటు వేశారు అధికారులు. అయితే సస్పన్షన్‌ను సవాల్ చేస్తూ సీనియర్లు కోర్టును ఆశ్రయించినట్లు..పిటిషన్‌ డిస్మస్ అయినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
Read Also : గుండెలు అదిరాయి : డ్రంక్ అండ్ డ్రైవ్‌కు మరణ శిక్ష