Indian Army : ఇండియన్ ఆర్మీలో 93 ఉద్యోగ ఖాళీల భర్తీ

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి.

Indian Army : ఇండియన్ ఆర్మీలో 93 ఉద్యోగ ఖాళీల భర్తీ

93 job vacancies in Indian Army

Indian Army : ఇండియన్ ఆర్మీలో సేవలందించాలనుకునే వారికి మంచి అవకాశం లభించనుంది. షార్ట్ సర్వీస్ కమిషన్ కోర్సు ద్వారా 93 పోస్టుల భర్తీ చేపట్టేందుకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అవివాహితులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. మొత్తం 93 టిక్నికల్ పోస్టులను ఇండియన్ ఆర్మీ భర్తీ చేయనుంది. వీటిలో 61 పోస్టులు పురుషులకు, 32 పోస్టులు మహిళలకు రిజర్వ్ చేశారు.

అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉండాలి లేదా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న వారై ఉండాలి. ఇండియన్ ఆర్మీలో సేవలందిస్తూ మరణించిన సైనికుల భార్యలు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే వారి వయసు 20 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. సర్వీస్‌లో మరణించిన భారత సాయుధ దళాల రక్షణ సిబ్బంది భార్యలకు ఎస్ఎస్సీడబ్ల్యు (నాన్ టెక్), ఎస్ఎస్సీడబ్ల్యు టెక్- A పోస్టులు కేటాయించారు. వయసు గరిష్టంగా 35 సంవత్సరాల వరకు ఉండవచ్చు.

ఎంపిక ప్రక్రియలో ముందు షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, స్టేజ్ 2 వంటి దశలు ఉంటాయి. అభ్యర్థులకు అర్హత ప్రమాణాలకు లోబడి మెరిట్ లిస్ట్‌ ప్రకటిస్తారు. ఫైనల్‌గా సెలక్ట్ అయిన వారికి 2023 అక్టోబర్‌లో ఎస్ఎస్‌సీ కోర్సు ప్రారంభమవుతుంది తమిళనాడు , చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో ఈ కోర్సును నిర్వహిస్తారు పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in పరిశీలించగలరు.