Agriculture Degree Programs : తెలంగాణాలో పలు యూనివర్శిటీల పరిధిలో వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ ఆనర్స్: ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. అగ్రికల్చర్‌, కమ్యూనిటీ సైన్స్‌, హార్టికల్చర్‌ విభాగాలు ఉన్నాయి.

Agriculture Degree Programs : తెలంగాణాలో పలు యూనివర్శిటీల పరిధిలో వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు

Admissions in agriculture oriented degree programs

Agriculture Degree Programs : హైదరాబాద్ లోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ స్టేట్‌ అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ, పీవీ నరసింహా రావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ స్టేట్‌ హార్టికల్చరల్‌ యూనివర్సిటీలు ఉమ్మడిగా వ్యవసాయ ఆధారిత డిగ్రీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జారీ అయింది. తెలంగాణ ఎంసెట్‌ 2022 ర్యాంక్‌ ఆధారంగా కౌన్సెలింగ్‌ నిర్వహించి అడ్మిషన్స్‌ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అగ్రికల్చరల్‌, వెటర్నరీ, హార్టికల్చర్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

బైపీసీ స్ట్రీం కింద బీఎస్సీ ఆనర్స్‌, బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌, బీఎఫ్ఎస్సీ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ రెగ్యులర్‌ అండ్‌ సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు. ప్రొఫెసర్‌ జయశంకర్‌, శ్రీ కొండా లక్ష్మణ్‌ వర్సిటీల పరిధిలో ఒక్కోదానిలో 40 శాతం సీట్లు; పీవీ నరసింహారావు వర్సిటీ పరిధిలో 25 శాతం సీట్లను గ్రామీణ రైతు కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు కేటాయించారు. మొత్తమ్మీద 85 శాతం సీట్లను స్థానికులకు కేటాయించారు. ఆసక్తిగల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన బోర్డు నుంచి బయాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్‌/పన్నెండోతరగతి/ తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎస్సీ ఆనర్స్: ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. అగ్రికల్చర్‌, కమ్యూనిటీ సైన్స్‌, హార్టికల్చర్‌ విభాగాలు ఉన్నాయి. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్ ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదున్నరేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో వెటర్నరీ సైన్స్‌ ప్రధాన విభాగం. బీఎఫ్‌ఎస్సీ ప్రోగ్రామ్‌ వ్యవధి నాలుగేళ్లు. ఈ ప్రోగ్రామ్‌లో ఫిషరీ సైన్స్‌ ప్రధాన విభాగం.

బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ఇంటర్‌ స్థాయిలో ద్వితీయ శ్రేణి మార్కులు తప్పనిసరి. అభ్యర్ధుల వయస్సుకు సంబంధించి బీఎస్సీ ఆనర్స్‌, బీఎఫ్‌ఎస్సీ ప్రోగ్రామ్‌లలో చేరాలంటే అభ్యర్థుల వయసు డిసెంబరు 31 నాటికి జనరల్‌ అభ్యర్థులకు 17 నుంచి 22 ఏళ్ల మధ్య, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య, దివ్యాంగులకు 17 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌ ప్రోగ్రామ్‌లో చేరాలంటే జనరల్‌ అభ్యర్థులకు 17 నుంచి 25 ఏళ్ల మధ్య, దివ్యాంగులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 17 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి.

దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే జనరల్‌ అభ్యర్థులకు రూ.1800; దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.900 దరఖాస్తుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీగా సెప్టెంబరు 19 గా నిర్ణయించారు. దరఖాస్తుకు చివరి తేదీగా సెప్టెంబరు 21గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.pjtsau.edu.in పరిశీలించగలరు.