Nsi : కాన్పూర్ ఎన్ ఎస్ ఐలో ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Nsi : కాన్పూర్ ఎన్ ఎస్ ఐలో ప్రవేశాలు

Kanpur Nsi

Nsi : కాన్పూర్ లోని నేషనల్ షుగర్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ ఎస్ ఐ)లో 2022-2023 విద్యాసంవత్సరానికి పలు ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

కోర్సుల వివరాలు ;

పీజీ డిప్లొమా కోర్సులు ; ఏఎన్ఎస్ఐ షుగర్ టెక్నాలజీ, ఏఎన్ఎస్ఐ షుగర్ ఇంజనీరింగ్, డీఐఎఫ్ఏటీ తదితర కోర్సులు

సర్టిఫికెట్ కోర్సులు ; షుగర్ బాయిలింగ్, షుగర్ ఇంజనీరింగ్, క్వాలిటీ కంట్రోల్

డిప్లొమా కోర్సులు ; ఫర్మంటేషన్ టెక్నాలజీ, షుగర్ ఇంజినీరింగ్, షుగర్ టెక్నాలజీ కెమిస్ట్రీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి సంబంధించి పదో తరగతి, ఇంటర్వీడియట్, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి అడ్మిన్ టెస్ట్ , ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలో పంపవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 11, 2022 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేదిగా మే 27, 2022ను నిర్ణయించారు. జూన్ 26,2022న పరీక్ష తేదిగా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://nsi.gov.in సంప్రదించగలరు.