Visakha IIPE : విశాఖ ఐఐపీఈ లో పీహెచ్ డీ ప్రొగ్రామ్ లో ప్రవేశాలు

మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 అనంతరం మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు.

Visakha IIPE : విశాఖ ఐఐపీఈ లో పీహెచ్ డీ ప్రొగ్రామ్ లో ప్రవేశాలు

Iipe Vizac

Visakha IIPE : ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ (ఐఐపీఈ) విశాఖపట్నంలో పేహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. బయోసైన్స్‌, కెమికల్‌ ఇంజనీరింగ్‌, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్సెస్‌ అండ్‌ ఇంజనీరింగ్‌, ఎర్త్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌, మేథమెటిక్స్‌, మెకానికల్‌ ఇంజనీరింగ్‌, పెట్రోలియం ఇంజనీరింగ్‌ వంటి స్పెషలైజేషన్ లలో పీహెచ్ డీ చేసేందుకు అవకాశం ఉంది. రెగ్యులర్‌, స్పాన్సర్డ్‌, వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌, ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీల్లో ప్రోగ్రామ్‌ అందుబాటులో
ఉంది.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఇంజనీరింగ్‌, టెక్నాలజీ, సైన్స్‌ విభాగాల్లో ప్రధమ శ్రేణి మార్కులతో ఎంఈ, ఎంటెక్‌, ఎంఎస్‌, ఎమ్మెస్సీ ఉత్తీర్ణఉలైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్పీ, ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉంటే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. నిర్దేశించిన ఇంజనీరింగ్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా అర్హులే. రెగ్యులర్‌ అభ్యర్థులకు వ్యాలిడ్‌ గేట్‌, నెట్‌ ఎన్‌బీహెచ్‌ఎం స్కోర్‌ ఉంటేనే సంస్థ రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ అందిస్తుంది.

ఐఐటీలు, ఐఐఎస్సీలు, ఐఐపీఈ, ఆర్‌జీఐపీటీ సంస్థలనుంచి కనీసం 75 శాతం మార్కులతో బీఈ, బీటెక్‌ డ్యూయెల్‌ డిగ్రీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, రెండేళ్ల ఎమ్మెస్సీ పూర్తిచేసినవారికి నేరుగా పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశం కల్పించడంతోపాటు రిసెర్చ్‌ అసిస్టెంట్‌ షివ్‌ అందిస్తారు. ఇండివిడ్యువల్‌ ఫెలోషిప్‌ కేటగిరీ కింద అప్లయ్‌ చేసుకోవాలంటే సీఎస్‌ఐఆర్‌, యూజీసీ, డీఎస్‌టీ , డీబీటీ, ఐసీఎంఆర్‌ పెలోషివ్‌ పొంది ఉండాలి. వ్యాలిడ్‌ అవార్డ్‌ లెటర్‌ను దరఖాస్తుకు జతపరచాల్సి ఉంటుంది. స్పాన్సర్డ్‌ కేటగిరీ అభ్యర్థులకు బోధన, రిసెర్చ్‌ అనుభవం ఉండాలి. వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌ ప్రోగ్రామ్‌లో చేరేనాటికి వారు పనిచేస్తున్న ప్రాజెక్ట్‌ వ్యవధి కనీసం రెండేళ్లు ఉండాలి.

రిసెర్చ్‌ అసిస్టెంట్‌షిప్‌ విషయానికి వస్తే సంస్థ నిబంధనల ప్రకారం అర్హులైన అభ్యర్థులకు గరిష్టంగా అయిదేళ్లపాటు రిసెర్చ్‌ అసిస్టెంట్‌షివ్‌ ఇస్తారు. మొదటి రెండేళ్లు నెలకు రూ.31,000 అనంతరం మూడేళ్లు నెలకు రూ.35,000 ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్‌ కింద ఏడాదికి రూ.30,000 ఇస్తారు. అకడమిక్‌ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు నిర్వహించి మెరిట్‌ ప్రకారం అడ్మిషన్స్‌ ఇస్తారు. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ట్యూషన్‌ ఫీజు ఉండదు. దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్‌ అభ్యర్థులకు రూ.300, మహిళలు, దివ్యాంగులు, ఎస్పీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: మే 31, 2022గా నిర్ణయించారు. రిటెన్‌ ఆన్‌లైన్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలు జూన్‌ 6 నుంచి 10 వరకు నిర్వహించనున్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను జూన్‌ 15, 2022న విడుదల చేస్తారు. అడ్మిషన తేదీ జూలై 25గా ప్రకటించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.iipe.ac.in పరిశీలించగలరు.