FDDI : ఎఫ్ డీడీఐ లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

FDDI : ఎఫ్ డీడీఐ లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు

Fddi

FDDI : ఫుట్ వేర్ , ఫ్యాషన్ , రిటైల్, లెదర్, యాక్సెసరీస్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులకు సంబంధించిన కోర్సులను అందించే సంస్ధ ఫుట్ వేర్ డిజూన్ అండ్ డెవలప్ మెంట్ ఇన్ స్టిట్యూట్ (ఎఫ్ డీడీఐ) యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేసింది. యూజీ, పీజీ, కోర్సుల్లో కలుపుకుని మొత్తం 2160 సీట్లు ఉన్నాయి. వీటితో పాటు ఎన్ ఆర్ ఐ, ఇండస్ట్రీ స్పాన్సర్డ్ సీట్లు 216 ఉన్నాయి.

యూజీ కోర్సుల వివరాలు ; బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ లో ఫుట్ వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ 720 సీట్లు, లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్ 180 సీట్లు, ఫ్యాషన్ డిజైన్ 660 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల కాలపరిమితి నాలుగేళ్లుగా నిర్ణయించారు. బీబీఏ లో రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ 240 సీట్లు ఉన్నాయి. కోర్సు వ్యవధి మూడేళ్ళుగా నిర్ణయించారు. ఈ కోర్సులు చేయాలనుకునే అభ్యర్ధులకు బ్యాచిలర్ కోర్సుల్లో ప్రవేశానికి ఇంటర్ ఉత్తీర్ణత, అలాగే ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

పీజీ కోర్సుల వివరాలు ; మాస్టర్ ఆఫ్ డిజైన్ లో ఫుట్ వేర్ డిజైన్ అండ్ ప్రొడక్షన్ 120 సీట్లు ఉన్నాయి. రెండేళ్ల వ్యవధితో ఈ కోర్సును అందిస్తున్నారు. అర్హత విషయానికి వస్తే లెదర్ గూడ్స్ అండ్ యాక్సెసరీస్ డిజైన్, డిజైన్, ఇంజనీరింగ్, ప్రొడక్షన్, టెక్నాలజీల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు పూర్తి చేసి ఉండాలి. ప్రస్తుతం ఆఖరు సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంబీఏ రిటైల్ అండ్ ఫ్యాషన్ మర్చెండైజ్ లో 240 కోర్సులు ఉన్నాయి. కోర్సు వ్యవధి రెండేళ్ళుగా నిర్ణయించారు. అర్హత విషయానికి వస్తే ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు , ఆఖరు సంవత్సరం చదువుతున్న విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వీటిలో ప్రవేశానికి జాతీయ స్ధాయిలో నిర్వహించే ఆల్ ఇండియా స్కిల్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. యూజీ , పీజీ పరీక్షలు ఆఫ్ లైన్ లో నిర్వహిస్తారు. ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి మ్యాట్ స్కోరుతో సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరితేది ఏప్రిల్ 28, 2022గా నిర్ణయించారు. ప్రవేశ పరీక్ష జూన్ 19, 2022 న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.fddiindia.com సంప్రదించగలరు.