Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

Admissions : సెస్ లో పీహెచ్ డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు

Center For Economic And Social Studies,

Admissions : హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌(సెస్‌) లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌ ఇన్‌ డెవల్‌పమెంట్‌ స్టడీస్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. నిజామాబాద్‌లోని తెలంగాణ యూనివర్సిటీ ఈ ప్రోగ్రామ్ కు సహకారం అందిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి అయిదేళ్ల కాలం. ఈ ప్రోగ్రామ్‌లో మొత్తం 12 సీట్లు ఉన్నాయి. మొదటి ఏడాది రెండు సెమిస్టర్లు ఉంటాయి. వీటిలో కోర్సు వర్క్‌లు ఉంటాయి. మొదటి సెమిస్టర్‌లో రిసెర్చ్‌ మెథడాలజీ, పరస్పెక్టివ్స్‌ అండ్‌ పారాడైమ్స్‌ ఆఫ్‌ డెవల్‌పమెంట్‌, ఫండమెంటల్స్‌ ఆఫ్‌ ఎకనామెట్రిక్స్‌,డెవల్‌పమెంట్‌ స్టాటిస్టిక్స్‌ పేపర్లు ఉంటాయి. రెండో సెమిస్టర్‌లో ఇండియాస్‌ డెవల్‌పమెంట్‌ డిబేట్‌, అప్లయిడ్‌ ఎకనామెట్రిక్స్, అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌, పారాడైమ్స్‌ ఇన్‌ సోషల్‌ సైన్సెస్‌ పేపర్లు ఉంటాయి. తరవాత నాలుగేళ్లపాటు రిసెర్చ్, థీసిస్‌ వర్క్‌ ఉంటుంది.

అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌తో పీజీ పూర్తిచేసి ఉండాలి. కనీసం 55 శాతం మార్కులు తప్పనిసరి. ఎంఫిల్‌ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యూజీసీ నెట్‌,స్లెట్‌, యూజీసీ ఎఫ్‌డీపీ ,రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌ అర్హత పొంది ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి దరఖాస్తులు పరిశీలించి అర్హులైన అభ్యర్థులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇందులో అర్హత పొందినవారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ జూలై 30గా నిర్ణయించారు. ఎంట్రెన్స్‌ టెస్ట్‌ తేదీ ఆగస్టు 13, ఇంటర్వ్యూలు ఆగస్టు 27న జరుగుతాయి. దరఖాస్తు హార్డ్‌ కాపీ పంపాల్సిన చిరునామా: డీన్‌, డివిజన్‌ ఆఫ్‌ గ్రాడ్యుయేట్‌ స్టడీస్‌, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌, నిజామియా అబ్జర్వేటరీ క్యాంపస్‌, బేగంపేట్‌, హైదరాబాద్‌ – 500016. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: www.cess.ac.in పరిశీలించగలరు.