IDRBT : ఐడీఆర్ బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలు

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.

IDRBT : ఐడీఆర్ బీటీలో పీజీ డిప్లొమా ప్రోగ్రాములో ప్రవేశాలు

Idrbt

IDRBT : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) పరిధిలోని హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఇన్ స్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రిసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో పీజీ డిప్లొమా ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నారు. ఏడాది కోర్సు వ్యవధి కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేషట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ (పీజీడీబీటీ) కోర్సులో ప్రవేశాలకు అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల విద్యార్హతల విషయానికి వస్తే 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్, మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. చివరి ఏడాది చదువుతున్న అభ్యర్ధులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అదే విధంగా జాతీయ అంతర్జాతీయ పరీక్షల స్కోర్ ఉండాలి. ఎంపిక విధానానికి సంబంధించి షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు.

అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు జూన్ 7, 2022 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; WWW.idrbt.in/ పరిశీలించగలరు.