All The Best : గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల పరీక్ష

  • Published By: madhu ,Published On : September 1, 2019 / 01:04 AM IST
All The Best : గ్రామ, వార్డు సచివాలయ పోస్టుల పరీక్ష

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగుల పోస్టుల భర్తీకి ఉద్దేశించిన రాత పరీక్షలు 2019, ఆగస్టు 01 ఆదివారం నుంచి స్టార్ట్ కానున్నాయి. ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. జులై 26న మొత్తం లక్షా 26 వేల 728 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మొత్తం 21 లక్షల 69 వేల 719 మంది దరఖాస్తు చేసుకున్నారు. సెప్టెంబర్ 01 నుంచి సెప్టెంబర్ 08వ తేదీ వరకు రాత పరీక్షలు జరుగనున్నాయి. తొలి రోజు 15 లక్షల 49 వేల 941 మంది హాజరు కానున్నారు. ఇందుకు 4 వేల 478 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. 

ఏ రోజు జవాబు పత్రాలను ఆ రోజు గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్ట్రాంగ్ రూంకు అధికారులు తరలించనున్నారు. స్కానింగ్ ప్రక్రియ విధుల్లో పాల్గొనే అధికారులకు శనివారం వర్సిటీలో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల సందేహాల నివృత్తికి రాష్ట్రస్థాయి కమాండ్ కంట్రోల్ ఫోన్ నెంబర్లు అందుబాటులో ఉంచారు. 9121296051, 9121296052, 9121296053, 9121296054, 9121296055.

గ్రామ వార్డు సచివాలయ పోస్టుల పరీక్షకు సర్వం సిద్ధం చేశామన్నారు విజయవాడ కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహమ్మద్‌. రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల 69 వేల మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. కృష్ణాజిల్లాలో 374 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. దివ్యంగులైన అభ్యర్థులకోసం 17 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జిల్లాలో 2 లక్షల 6 వందల 55 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొన్నారన్నారు. పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయ తెలిపారు. అభ్యర్థలు నియమనిబంధనలను కచ్చితంగా పాటించాలని చెప్పారు. అభ్యర్థులను ఉదయం 9.30 గంటల నుంచి అనుమతిస్తామన్నారు. ఉదయం 10 గంటలలోపే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించని హెచ్చరించారు. 

అనంతపూర్ జిల్లా మడకశిర మండలంలో నిర్వహించనున్న గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్ష కేంద్రాలకు ఒక నిమిషం ఆలస్యమైనా అభ్యర్థులను అనుమతించేదిలేదని ఆర్డీవో శ్రీనివాసులు హెచ్చరించారు. ఎంపీడీవో కార్యాలయంలో పరీక్ష కేంద్రాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోలీస్ స్టేషన్‌లోని స్ట్రాంగ్ రూమ్స్‌ను, పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. అభ్యర్థులు వారి  హాల్ టికెట్‌తోపాటు గుర్తింపు కార్డుతో 9 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి రావాలని సూచించారు. అభ్యర్థుల సౌకర్యార్థం గ్రామాల నుంచి బస్సులు.. వికలాంగులకు పరీక్ష కేంద్రాల వద్ద వీల్ చైర్స్  అందుబాటులో ఉంటాయని తెలిపారు.

సెప్టెంబర్ 01 ఆదివారం ఉదయం జరిగే పరీక్షలు : – 
1. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ – 5 7, 040
2. మహిళా పోలీసు 14, 944
3. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ 11, 158
4. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ 3, 307
మధ్యాహ్నం పరీక్ష : –
1. డిజిటల్ అసిస్టెంట్ 11, 158
Read More : గ్రామ, వార్డు సచివాలయ పరీక్ష : అభ్యర్థులకు రూల్స్ ఇవే