AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

AIIMS Hospital Vacancies

AIIMS Recruitment : ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఎయిమ్స్‌ పట్నా క్యాంపస్‌లో పలు విభాగాల్లో మొత్తం 644 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ , పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, సీనియర్ ప్రోగ్రామర్, సీనియర్ డైటీషియన్, ఆయుష్ మెడికల్ ఆఫీసర్, యోగా వంటి నాన్‌ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Benefits Of Cycling : శరీరానికి , మనస్సుకు సైకిల్ తొక్కడం వల్ల కలిగే ప్రయోజనాలు !

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల‌ ఆధారంగా పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్ , డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థులను రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

READ ALSO : Vegetarian Keto Diet : శాఖాహార కీటో డైట్‌లో ఎలాంటి ఆహారాలు తినొచ్చంటే ?

ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు జూన్ 04వ తేదీతో గడువు ముగుస్తుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://aiimspatna.edu.in/ పరిశీలించగలరు.