గెట్ రెడీ: రేపే గ్రూప్-2 స్రీనింగ్ పరీక్ష

  • Published By: veegamteam ,Published On : May 4, 2019 / 07:43 AM IST
గెట్ రెడీ: రేపే గ్రూప్-2 స్రీనింగ్ పరీక్ష

ఏపీలో పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) 446 గ్రూప్-2 పోస్టుల భర్తీకి సంబంధించి మే 5న నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పరీక్షలకు హాజరయ్యే మొత్తం 2,96,036 లక్షల మంది అభ్యర్థుల కోసం రాష్ట్రవ్యాప్తంగా 727 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. గరిష్ఠంగా విశాఖ జిల్లాలో 106, కనిష్ఠంగా నెల్లూరులో 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఆఫ్‌లైన్ విధానంలోనే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నారు. 

పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షలకు ఎంపిక చేస్తారు. వీరికి జులై 18, 19 తేదీల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్లూ రాయాల్సిందే. ఏ ఒక్క పేపర్‌ రాయకపోయినా తర్వాత ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు. 

అభ్యర్థులకు ముఖ్య సూచనలు.. 
* అభ్యర్థులు చెప్పిన సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 
* ఉదయం 9.00 నుంచి 9.45 గంటల మధ్య పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. నిమిషం ఆలస్యమైన అనుమతించరు.
* అభ్యర్ధులు హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా గుర్తింపు కార్డును తీసుకెళ్లాల్సి ఉంటుంది.