ప్రవేశాలు : ఏపీలో గురుకులాల ప్రవేశాలు

  • Published By: madhu ,Published On : January 30, 2019 / 03:50 AM IST
ప్రవేశాలు : ఏపీలో గురుకులాల ప్రవేశాలు

గురుకుల విద్యాలయాల సంస్థ ఏపీ రాష్ట్రంలోని 38 సాధారణ, 12 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 2019-20కి గాను ఐదో తరగతి (ఈఎం)లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
అర్హత : సంబంధిత జిల్లాల్లో 2017-18, 2018-19 విద్యా సంవత్సరాల్లో నిరవధికంగా ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి, ప్రస్తుత విద్యా సంవత్సరం (2018-19)లో నాలుగో తరగతి చదువుతూ ఉండాలి. అభ్యర్థి తల్లి, తండ్రి /  సంరక్షకుల వార్షికాదాయం(2018 /19) రూ. లక్షకు మించకూడదు. 
వయస్సు : ఓసీ, బీసీ విద్యార్థులు సెప్టెంబర్ 1, 2008 నుండి ఆగస్టు 31, 2010 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు సెప్టెంబర్ 1, 2006 నుండి ఆగస్టు 31, 2008 మధ్య జన్మించి ఉండాలి. 
ఎంపిక : ప్రవేశ పరీక్ష ఆధారంగా.
ప్రవేశ పరీక్ష తేది : మార్చి 9, 2019 (నాలుగో తరగతి స్థాయిలో జరిగే ఈ పరీక్ష తెలుగు / ఇంగ్లీషు / ఉర్దూ మీడియంలో జరుగుతుంది). 
దరఖాస్తు విధానం : ఆన్ లైన్‌లో
దరఖాస్తు ఫీజు : రూ. 50
దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 20, 2019
వెబ్ సైట్ : https:/aprjdc.apcfss.in