ఫస్ట్ టైమ్ గ్రేడింగ్ : ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్స్ట్ ను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్‌ విద్యా

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 01:51 AM IST
ఫస్ట్ టైమ్ గ్రేడింగ్ : ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్స్ట్ ను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్‌ విద్యా

ఏప్రిల్ 12న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. రిజల్స్ట్ ను అమరావతిలోని ఏపీ సచివాలయం కాన్ఫరెన్స్ హాల్ లో ఉదయం 11గంటలకు విడుదల చేస్తామని ఇంటర్‌ విద్యా మండలి కార్యదర్శి ఉదయలక్ష్మి తెలిపారు. ఈ ఏడాది(2019) ఫస్ట్ టైమ్.. ఇంటర్ ఫలితాలను గ్రేడింగ్‌ విధానంలో విడుదల చేస్తున్నారు. 2018లో ఫస్టియర్ కి గ్రేడింగ్‌ విధానం అమలు చేయగా.. ఈసారి సెకండియర్ ఫలితాలను గ్రేడింగ్‌లో విడుదల చేస్తున్నారు. మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు డిప్రెషన్ లోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీంతో వారిపై ఒత్తిడిని తగ్గించేందుకు ఇంటర్ విద్యాశాఖ గ్రేడింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఏపీలో ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహించారు. 1,423 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ కలిపి 10,17,600మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 2018లో ఏప్రిల్ 13న ఇంటర్ ఫలితాలు రిలీజ్ చేశారు. ఫస్టియర్ లో 62శాతం ఉత్తీర్ణత నమోదుకాగా.. సెకండియర్ లో 73.33 శాతం విద్యార్థులు పాస్ అయ్యారు.

ఫలితాల కోసం వెబ్ సైట్లు..
https://results.apcfss.in
http://bieap.gov.in
https://jnanabhumi.ap.gov.in