మే 14 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

  • Published By: veegamteam ,Published On : May 10, 2019 / 03:13 PM IST
మే 14 నుంచి ఏపీ ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

ఏపీలో మే 14 నుంచి మే 22 ఇంటర్మీడియట్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి ఉదయలక్ష్మీ తెలిపారు. ఈ పరీక్షలకు 4 లక్షల 24 వేల 5 వందల మంది విద్యార్థులు హాజరవ్వనున్నట్లు వెల్లడించారు. ఇంప్రూవ్ మెంట్ కోసం లక్షా 75 వేల మంది పరీక్ష రాస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 922 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈమేరకు ఆమె శుక్రవారం (మే 10, 2019)న అమరావతిలో మీడియాతో మాట్లాడారు. 

ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటలకు వరకు జరుగనున్నట్లు వెల్లడించారు. జ్ఞాన భూమి వెబ్ సైట్ లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. (జూన్, 2019) మొదటివారంలో రిజల్ట్స్ విడుదల చేస్తామన్నారు.