10th Supplementary Exams : ఏపి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుండి ప్రారంభం

ఇప్పటికే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,12,221 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోగా , మొత్తం 915 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వాహణకు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9.30 నిమిషాల నుండి 12.45 వరకు జరుగుతుంది.

10th Supplementary Exams : ఏపి టెన్త్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుండి ప్రారంభం

10th Supplementary Exams

10th Supplementary Exams : ఆంధ్రప్రదేశ్ లో జూన్ 2 నుంచి పదో తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఎస్ ఎస్సీ పరీక్షల విభాగం ప్రకటించిన వివరాల ప్రకారం పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 2 నుంచి 10 వరకు జరగనున్నాయి.

READ ALSO : Fatty Liver Problem : కాలేయ ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు ఇంటి చిట్కాలు ఇవే ?

ఇప్పటికే పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 2,12,221 మంది విద్యార్ధులు రిజిస్ట్రేషన్ చేసుకోగా , మొత్తం 915 పరీక్షా కేంద్రాలను పరీక్ష నిర్వాహణకు అధికారులు సిద్ధం చేశారు. ఉదయం 9.30 నిమిషాల నుండి 12.45 వరకు జరుగుతుంది. విద్యార్థులను 45 నిమిషాల ముందు నుండే హాలులోకి అనుమతించనున్నారు. అలస్యంగా వచ్చిన వారిని పరీక్షా కేంద్రంలోని అనుమతించరు.

READ ALSO : APPSC Group -1 : జూన్ 3 నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు

తేదిల వారిగా పరీక్షలకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తే జూన్ 2న ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్ష జరుగనుంది. 3వతేదిన సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష, 4వతేదిన సెలవు దినం, 5వతేదిన ఇంగ్లీష్, 6 వతేదిన గణితం, 7వతేదిన సైన్స్, 8వతేదిన సోషల్ పరీక్షలు జరుగుతాయి. 9వతేదిన కంపోజిటివ్ కోర్స్ (ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్), ఓఎస్ ఎస్ సీ మెయిన్ లాంగ్వేజ్ 1, 10వతేదిన లాంగ్వేజ్ పేపర్ ఉంటుంది. హాల్ టికెట్లు సంబంధిత వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎస్ ఎస్సీ పరీక్షల కన్వీనర్ దేవానందరెడ్డి తెలిపారు.