ONGC Scholarship : ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు!

ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి.

ONGC Scholarship : ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాలర్ షిప్ లకు దరఖాస్తులు!

ONGC Scholarship Scheme

ONGC Scholarship : ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్జీసీ) 2021-22 విద్యా సంవత్సరానికిగాను విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ అందించనుంది. దీనికి గాను అర్హులైన డిగ్రీ, పీజీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హతలకు సంబంధించి డిగ్రీ స్కాలర్ షిప్ లకు ఇంటర్లో 60 శాతం మార్కులు, పీజీ స్కాలర్ షిప్స్ కు డిగ్రీలో 60 శాతం మార్కులు ఉండాలి.

ఇంజినీరింగ్/ఎంబీబీఎస్/మాస్టర్స్ డిగ్రీ/ ఎంబీఏ ఉత్తీర్ణత. 2021-22 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు పొందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల వయసు 30 సంవత్సరాలలోపు ఉండాలి. అలాగే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ ఉపకారవేతనాలు పొందడానికి అర్హులు. విద్యార్థుల కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షల్లోపు ఉండాలి. స్కాలర్ షిప్స్ లో మహిళ అభ్యర్థులకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు.

ఎంపిక విధానం అకడమిక్ మార్కులు, క్వాలిఫైయింగ్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతి ఏటా స్కాలర్ షిప్ గాను రూ.48000 చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదిగా మార్చి06, 2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.ongcscholar.org/ పరిశీలించగలరు.