Vidyadhan Scholarships : విద్యాధన్ స్కాలర్ షిప్పులకు ధరఖాస్తులు

ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ప్రతిభ అధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అ

Vidyadhan Scholarships : విద్యాధన్ స్కాలర్ షిప్పులకు ధరఖాస్తులు

Vidyadhan

Vidyadhan Scholarships : ప్రతిభావంతులైన ఇంటర్మీడియట్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం మరియు డిప్లోమా చదువుతున్న విద్యార్ధులకు ఆర్ధిక సహాకారం అందించేందుకు సరోజనీ దామోదర్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. విద్యాధన్ పేరుతో స్కాలర్ షిప్పులను అందజేయనుంది. దీనికి సంబంధించిన విద్యార్ధుల నుండి ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ జారీచేసింది.

దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఈసంస్ధ విద్యార్ధులకు స్కాలర్ షిప్పులను అందజేస్తుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్ధులకు స్కాలర్ షిప్ లను అందించేందుకు ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకునే ప్రక్రియను ప్రారంభించింది. ఎంపికైన అభ్యర్ధులకు ఫౌండేషన్ మెంటార్ ప్రోగ్రాములను కూడా నిర్వహించనుంది. స్కాలర్ షిప్పులకోసం ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు గుర్తింపు పొందిన పాఠశాల నుండి కనీసం 90శాతం మార్కుల తో 9సీజీపీఏ స్కోరుతో పదోతరగతి లేదంటే తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారు ఈ స్కాలర్ షిప్నులకు ధరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. వార్షిక అదాయం 2లక్షలలోపు ఉండాలి. దివ్యాంగులు 75శాతం మార్కులు, 7.5సీజీపీఏ స్కోరు కలిగి ఉంటే సరిపోతుంది.

ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులను ప్రతిభ అధారంగా షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్టులో ఉన్న అభ్యర్ధులకు ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులుగా ఎంపిక చేస్తారు. పరీక్షా కేంద్రాల సమాచారాన్ని ఈ మెయిల్ , ఫోన్ ఎస్ ఎమ్ ఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు ఏడాదికి 6వేల రూపాయల చొప్పున స్కాలర్ షిప్ అందిస్తారు. అత్యధిక స్కోరుతో కోర్సు పూర్తి చేసుకున్న వారికి పైచదువుల సమయంలో ఏడాదికి 10వేల రూపాయల నుండి 60వేల రూపాయల వరకు స్కాలర్ షిప్ అందజేస్తారు.

ధరఖాస్తులకు చివరి తేది సెప్టెంటర్ 10గా నిర్ణయించారు. ధరఖాస్తుకు పదోతరగతి పరీక్షల మార్కుల జాబితా పత్రం, అదాయ దృవీకరణ పత్రం, అభ్యర్ధి ఫోటో, ఇంటర్మీడియట్ లో అడ్మిషన్ పొందిన కళాశాల వివరాలు తెలియజేయాసల్సి ఉంటుంది. అభ్యర్ధులకు స్కీనింగ్ సెప్టెంబర్ 25వ తేదిన ఉంటుంది. అన్ లైన్ టెస్ట్ , ఇంటర్వ్యూలు సెప్టెంబర్ 30 నుండి అక్టోబర్ 10వరకు కొనసాగుతాయి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ WWW.Vidyadhan.org./apply పరిశీలించగలరు.