Recruitment In BSNL : బీఎస్ఎన్ ఎల్ లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అకాడమిక్ మెరిట్ ఆధారంగా ముందుగా షార్ట్ లిస్టు తయారుచేస్తారు. దానిలో ఎంపికైన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు. తర్వాత తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Recruitment In BSNL : బీఎస్ఎన్ ఎల్ లో అప్రెంటిస్ ట్రైనీ పోస్టుల భర్తీ

Apprentice Trainee Posts Recruitment in BSNL

Recruitment In BSNL : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ ఎల్) పలు పోస్టుల భర్తీ చేపట్టనుంది. కర్ణాటక సర్కిల్ లోని అప్రెంటిస్‌షిప్ ట్రైనీ పోస్టుల కొరకు ఈ నియామకాలు చేపడుతున్నారు. ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కింద మొత్తం 100 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరుతున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంజనీరింగ్‌లో అర్హత కలిగిన డిగ్రీ/గ్రాడ్యుయేట్ (టెక్నికల్,నాన్-టెక్నికల్) మరియు టెక్నికల్ అప్రెంటీస్,డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.

అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే అకాడమిక్ మెరిట్ ఆధారంగా ముందుగా షార్ట్ లిస్టు తయారుచేస్తారు. దానిలో ఎంపికైన వారిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఆహ్వానిస్తారు. తర్వాత తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఆన్‌లైన్ లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు ఆగస్టు 29, 2022లోగా దరఖాస్తులు పంపేందుకు చివరి గడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ https://karnataka.bsnl.co.in/.