Apprentice Vacancies : విశాఖ స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ

భర్తీ చేయనున్న అప్రెంటిస్ పోస్టుల్లో ఫిట్టర్ 80, టర్నర్ 10, మెషినిస్ట్ 14, వెల్డర్ గ్యాస్ & ఎలక్ట్రిక్ 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 20, ఎలక్ట్రీషియన్ 65, కార్పెంటర్ 20, మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ 10, మెకానిక్ డీజిల్ 30, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 30 ఖాళీలు ఉన్నాయి.

Apprentice Vacancies : విశాఖ స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ ఖాళీల భర్తీ
ad

Apprentice Vacancies : విశాఖపట్నంలో స్టీల్‌ ప్లాంట్‌ పలు అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన ఈ సంస్థలో పలు విభాగాల్లో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులను కోరుతున్నారు. ఈనోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 319 అప్రెంటిస్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

భర్తీ చేయనున్న అప్రెంటిస్ పోస్టుల్లో ఫిట్టర్ 80, టర్నర్ 10, మెషినిస్ట్ 14, వెల్డర్ గ్యాస్ & ఎలక్ట్రిక్ 40, మెకానిక్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ 20, ఎలక్ట్రీషియన్ 65, కార్పెంటర్ 20, మెకానిక్ రిఫ్రిజిరేషన్ మరియు ఎయిర్ కండిషనింగ్ 10, మెకానిక్ డీజిల్ 30, కంప్యూటర్ ఆపరేటర్ మరియు ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 30 ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రెడులలో ఐటీఐలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. విద్యార్థుల వయసు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 7,700 నుంచి రూ. 8,050 స్టైఫండ్‌గా చెల్లిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణకు 18 ఆగస్టు 2022ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.vizagsteel.com పరిశీలించగలరు.