అభ్యర్థులకు ముఖ్యగమనిక : APPSC పరీక్షలు వాయిదా

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి

  • Published By: veegamteam ,Published On : October 16, 2019 / 03:16 AM IST
అభ్యర్థులకు ముఖ్యగమనిక : APPSC పరీక్షలు వాయిదా

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి

ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా పడ్డాయి. 5 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు వాయిదా వేశారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్, నవంబర్ లో పరీక్షలు జరగాల్సి ఉంది. ఇప్పుడా షెడ్యూల్ మారింది. త్వరలో కొత్త పరీక్ష తేదీలు రానున్నాయి. 

వివిధ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.. పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఫారెస్ట్‌ రేంజ్ ఆఫీసర్(10/2018), గెజిటెడ్‌ పోస్టులు(14/2108), పాలిటెక్నిక్‌ లెక్చరర్(23/2018), నాన్‌-గెజిటెడ్‌ ఆఫీసర్స్(15/2019), డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టుల(26/2018) మెయిన్స్ పరీక్షలు వాయిదా ఉన్నాయి. ఎగ్జామ్స్ కి సంబంధించి క్వశ్చన్ పేపర్ తయారీ ఇతర అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు తగిన సమయం లేకపోవడంతో పరీక్షలను వాయిదా వేసినట్టు కమిషన్ తెలిపింది. వీటి పరీక్షలు తిరిగి ఎప్పుడు నిర్వహించేది అక్టోబర్ 22న ప్రకటిస్తామని కమిషన్ సభ్యులు వెల్లడించారు.

* ఏపీపీఎస్సీ పరీక్షలు వాయిదా
* 5 నోటిఫికేషన్లకు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్స్ వాయిదా
* అక్టోబర్, నవంబర్ లో జరగాల్సిన ఎగ్జామ్స్ పోస్ట్ పోన్
* అక్టోబర్ 22న కొత్త పరీక్షల తేదీలు ప్రకటన