Jobs : అసిస్టెంట్ కమండెంట్ పోస్టుల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు.

Jobs : అసిస్టెంట్ కమండెంట్ పోస్టుల భర్తీ

Upsc

Jobs : యూపీఎస్సీ కేంద్ర సాయుధ బలగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సీఏసీఎఫ్2022 నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 253 పోస్టులను భర్తీ చేయనున్నారు. విభాగాల వారీగా ఖాళీలను పరిశీలిస్తే బీఎస్ ఎఫ్ 66 ఖాళీలు, సీఆర్పీఎఫ్ 29 ఖాళీలు, సీఐఎస్ఎఫ్ 62ఖాళీలు,ఐటీబీపీ 14 ఖాళీలు, ఎస్ ఎస్ బీ 82 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల విద్యార్హతలకు సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ, తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 2022లో డిగ్రీ పరీక్షలకు హాజరవుతున్న వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులే. నిర్ధిష్టమైన శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 20 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక విధానం విషయానికి వస్తే రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టులు, ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేది మే 10, 2022గా నిర్ణయించారు. పరీక్షను ఆగస్టు 7, 2022న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in/పరిశీలించగలరు.