Ignou : ఇగ్నోలో బీ.ఎడ్. కోర్సులో ప్రవేశాలు

పూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది.

Ignou : ఇగ్నోలో బీ.ఎడ్. కోర్సులో ప్రవేశాలు

Ignou

Ignou : ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ జనవరి 2022 విద్యాసంవత్సారానికి బీ.ఈడీలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతుంది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ థియరీ, ప్రాక్టికల్ కలిపి కోర్సు ఉంటుంది. కోర్సు కాల వ్యవధి కనీసం రెండు సంత్సరాలు, ఐదేళ్లు గరిష్టంగా ఉంటుంది. అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే గుర్తింపు ఉన్న యూనివిర్శిటీ లేదా కాళాశాల నుండి 50 శాతం మార్కులతో యూజీ, లేదా పీజీతో పాటు బోధనలో అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎంపిక విషయానికి వస్తే ప్రవేశ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. బోధన ఇంట్లీష్, హిందీ మీడియంలో ఉంటుంది.

పూర్తికాలానికి ఫీజు 50,000రూ చెల్లించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష విషయానికి వస్తే కంప్యూటర్ బేస్డ్ ఆన్ లైన్ పరీక్ష నిర్వహిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్ష ఫీజు 1,000రూ గా నిర్ణయించారు. దరఖాస్తులను ఆన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు చివరితేదిగా ఏప్రిల్ 17, 2022గా నిర్ణయించారు. పరీక్షను మే 8వ తేదిన నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ http://ignou.ac.in సంప్రదించగలరు.