BOB Recruitment 2021 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 మంది మేనేజర్ల పోస్టులు, ఏప్రిల్ 29 వరకు అప్లయ్ చేసుకోవచ్చు!

బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో మేనేజర్ 511 పోస్టులపై నియామకాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన విడుదల చేసింది.

BOB Recruitment 2021 : బ్యాంక్ ఆఫ్ బరోడాలో 511 మంది మేనేజర్ల పోస్టులు, ఏప్రిల్ 29 వరకు అప్లయ్ చేసుకోవచ్చు!

Bank Of Baroda Recruitment 2021 Recruitment Of 511 Managers In Bank Of Baroda Online Application Till 29 April

Bank of Baroda Recruitment 2021 : బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రభుత్వ బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులకు గుడ్ న్యూస్.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో మేనేజర్ 511 పోస్టులపై నియామకాలకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటన విడుదల చేసింది. సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్, టెరిటరీ హెడ్, గ్రూప్ హెడ్, ప్రొడక్ట్ (ఇన్వెస్ట్మెంట్ & రీసెర్చ్), హెడ్ (ఆపరేషన్స్ & టెక్నాలజీ), డిజిటల్ సేల్స్ మేనేజర్, ఐటీ ఫంక్షనల్ ఎనలిస్ట్-మేనేజర్ స్థానాలకు నియామకాలు విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంకు అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.inలో అందించిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు, ఏప్రిల్ 9, 2021 నుండి ప్రారంభమైంది. అభ్యర్థులు ఏప్రిల్ 29లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులను సమర్పించగలరు.

దరఖాస్తు ఎలా? :
దరఖాస్తు కోసం ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్, bankofbaroda.inని విజిట్ చేయండి. కెరీర్ సెక్షన్ పై క్లిక్ చేయండి. సంబంధిత రిక్రూట్ మెంట్ ప్రకటన లింక్ ఆన్‌లైన్ దరఖాస్తుకు లింక్ పై క్లిక్ చేయండి. అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్ చేసి, ఇక్కడ అవసరమైన వివరాలను ఫిల్ చేయండి. వివిధ క్వాలిఫికేషన్ సాఫ్ట్ కాపీలను అప్‌లోడ్ చేయండి.. ఆ తర్వాత దరఖాస్తు పేజీకి రిడైరెక్ట్ అవుతుంది. అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడాలో రూ .600 దరఖాస్తు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. ఆన్‌లైన్ మోడ్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ.100 మాత్రమే చెల్లించాలి.

పోస్టుల ప్రకారం.. ఖాళీల సంఖ్య
సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్ – 407 పోస్టులు
ఇ-వెల్త్ రిలేషన్షిప్ మేనేజర్ – 50 పోస్ట్లు
టెరిటరీ హెడ్ – 44 పోస్ట్లు
గ్రూప్ హెడ్ – 6 పోస్ట్లు
ప్రొడక్ట్ హెడ్ (ఇన్వెస్ట్మెంట్ & రీసెర్చ్) – 1 పోస్ట్
హెడ్ ​​(ఆపరేషన్స్ & టెక్నాలజీ) – 1 పోస్ట్
డిజిటల్ సేల్స్ మేనేజర్ – 1 పోస్ట్
ఐటి ఫంక్షనల్ అనలిస్ట్-మేనేజర్ – 1 పోస్ట్