Job Vacancies : బీఈసీఐఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

ఖాళీల వివరాలకు సంబంధించి అకౌంటెంట్ 2ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్ 1ఖాళీ, ఆఫీస్ అసిస్టెంట్ 1ఖాళీ, టెస్ట్ డ్రైవర్ 6ఖాళీ, ఆఫీస్ అటెండెంట్ 1ఖాళీ, హౌస్ కీపింగ్ సేవలకు క్లీనర్ 1ఖాళీ ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Job Vacancies : బీఈసీఐఎల్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

Job Vacancies : బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత మినీ రత్న కంపెనీకి చెందిన ఈ సంస్థలోని పలు విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్ట్‌లను కాంట్రాక్ట్‌ విధానంలో భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషనల్‌ భాగంగా మొత్తం 12 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఖాళీల వివరాలకు సంబంధించి అకౌంటెంట్ 2ఖాళీలు, సీనియర్ అసిస్టెంట్ 1ఖాళీ, ఆఫీస్ అసిస్టెంట్ 1ఖాళీ, టెస్ట్ డ్రైవర్ 6ఖాళీ, ఆఫీస్ అటెండెంట్ 1ఖాళీ, హౌస్ కీపింగ్ సేవలకు క్లీనర్ 1ఖాళీ ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టుల ఆధారంగా పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి. అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూలు జరిగే చిరునామా ; ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ, నాట్రిప్‌ ఇంప్లిమెంటేషన్ సొసైటీ విభాగం, ప్లాట్ నెం.26, సెక్టార్-3, ఐఎంటీ మనేసర్, గుర్గావ్. ఇంటర్వ్యూలను 5 ఆగస్టు 2022 తేదీన నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ;https://www.becil.com/ పరిశీలించగలరు.