BRAOU ADMISSION : అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు!

మిగిలిపోయిన 53 సీట్లను ప్రస్తుతం స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవేశాలు పొందిన అభ్యర్థులు మరో కోర్సుకు మారేందుకు స్లైడింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనున్నారు.

BRAOU ADMISSION : అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో బీఈడీ స్పాట్‌ అడ్మిషన్లు!

BED spot admissions in Ambedkar Open University!

BRAOU ADMISSION : హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. ఎంట్రన్స్ టెస్ట్‌లో ర్యాంక్‌ సాధించిన వారు మాత్రమే ప్రవేశానికి అర్హులు.

స్పాట్ అడ్మిషన్లు డిసెంబర్‌ 8వ తేదీన ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌ లో నిర్వహించనున్నారు. యూనివర్శిటీలోని అకడమిక్‌ బ్లాక్‌లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు అభ్యర్ధులు హాజరుకావల్సి ఉంటుంది.

ఇదిలా వుంటే 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండు విడతల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలు నిర్వహించిన విషయం తెలిసిందే. మిగిలిపోయిన 53 సీట్లను ప్రస్తుతం స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రవేశాలు పొందిన అభ్యర్థులు మరో కోర్సుకు మారేందుకు స్లైడింగ్‌కు కూడా అనుమతి ఇవ్వనున్నారు.

రిజర్వేషన్‌, ర్యాంకుల ఆధారంగా స్లైడింగ్‌కు అవకాశం కల్పించనున్నారు. స్పాట్ అడ్మిషన్లకు హాజరుకావాల్సిన చిరునామా; భవనం వెంకట్రామ్ ఆడిటోరియం, అకడమిక్ బ్లాక్, డా.బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ, రోడ్ నెం.46, జూబ్లీహిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ పరిశీలించగలరు.