ఉద్యోగ సమాచారం : BEE 22 పోస్టులు

  • Published By: madhu ,Published On : April 24, 2019 / 02:14 AM IST
ఉద్యోగ సమాచారం : BEE 22 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని చట్టబద్ధ సంస్థ అయిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (BEE)న్యూఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 22 సెక్టార్ ఎక్స్ పర్డ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

విభాగాలు : ఫెర్టిలైజర్, డిస్కమ్, ట్రాన్స్ పోర్టు, పెట్రో కెమికల్, రైల్వేస్, బిల్డింగ్, క్లైమెట్ ఫైనాన్స్, అల్యూమినియం, బ్యాంకింగ్, రిఫైనర్సీ, పల్స్ అండ్ పేపర్, సిమెంట్ సెక్టార్. 
అర్హత : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్ / పీజీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట అనుభవం ఉండాలి. సంబంధిత స్పెషలైజేషన్‌లో సర్టిఫికేట్ కోర్టులు పూర్తి చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. 
వయస్సు : 2019, జనవరి 1 నాటికి ఫుల్ టైమ్ సెక్టార్ ఎక్స్‌పర్డ్‌కు గరిష్ట వయస్సు 40 ఏళ్లు. పార్ట్‌టైమ్ సెక్టార్ ఎక్స్ పర్డ్‌కు గరిష్ట వయస్సు 65 ఏళ్లు. 
ఎంపిక విధానం : షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
చిరునామా : సెక్రటరీ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, 74వ ఫ్లోర్, సేవాభవన్, ఆర్.కె.పురం, సెక్టార్ – 1, న్యూఢిల్లీ 110066
దరఖాస్తుకు చివరి తేదీ : ఎంప్లాయి‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుండి 15 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి. 
పూర్తి వివరాలకు వెబ్ సైట్ : https://beeindia.gov.in