బీహార్ BSEB-2021 టెన్త్ రిజల్ట్స్.. ఈరోజు మధ్యాహ్నం 3.30కు చెక్ చేసుకోండి!

బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB), పాట్నా మెట్రిక్యూలేషన్ (10వ తరగతి) ఫలితాలు ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు.

బీహార్ BSEB-2021 టెన్త్ రిజల్ట్స్.. ఈరోజు మధ్యాహ్నం 3.30కు చెక్ చేసుకోండి!

India Coronavirus Cases (1)

Bihar Board 10th Result 2021 LIVE Updates : బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB), పాట్నా మెట్రిక్యూలేషన్ (10వ తరగతి) ఫలితాలు ఏప్రిల్ 5న మధ్యాహ్నం 3.30 గంటలకు రిలీజ్ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి విజయ్ కుమార్ చౌదరి ఒక ప్రకటనలో వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈసారి పదో తరగతి ఫలితాల విడుదలకు సంబంధించి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయలేదు. ఏప్రిల్ 4న బోర్డు చైర్మన్ ఆనంద్ కిషోర్.. పదో తరగతి ఫలితాలను బోర్డు BSEB అధికారిక వెబ్ సైట్లలో biharboardonline.bihar.gov.in తెలుసుకోవచ్చునని చెప్పారు. బీహార్ బోర్డు మెట్రిక్ స్కోర్లను onlinebseb.in వెబ్ సైట్లో కూడా తెలుసుకోవచ్చు. విద్యార్థులు ప్రతి సబ్జెక్టులో కనీసం 30శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణత సాధిస్తారు. ఈ పరీక్షా ఫలితాల్లో ఫెయిల్ అయినవారు కంపార్టమెంటల్ ఎగ్జామ్ లో మళ్లీ రాయాల్సి ఉంటుంది.

అధికారిక వెబ్ సైట్ biharboardonline.bihar.gov.in విజిట్ చేయండి.
హోంపేజీలో 10th Results రిజల్ట్స్ లింకుపై క్లిక్ చేయండి.
మీ రోల్ (హాల్ టికెట్) నెంబర్, ఇతర వివరాలతో లాగిన్ అవ్వండి.
బీహార్ బోర్డు 10వ తరగతి ఫలితాలు స్ర్కీన్ పై డిస్ ప్లే అవుతాయి.
మీ రిజల్ట్ ను డౌన్ లోడ్ చేసుకోండి.. ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దగ్గర ఉంచుకోండి.