Bihar Board Result 2021: మార్చి 25న BSEB 12th ఇంటర్ ఫలితాలు

బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB) బోర్డు BSEB intermediate result 2021 అతి త్వరలో రిలీజ్ కానున్నాయి. మార్చి 25న ద్వితీయ ఇంటర్ ఫలితాలను ప్రకటించనుంది.

Bihar Board Result 2021: మార్చి 25న BSEB 12th ఇంటర్ ఫలితాలు

Bihar Board Result 2021 Bseb 12th Inter Result 2021 Expected To Be Declared In A Week

Bihar Board Result 2021 : బీహార్ స్కూల్ ఎగ్జామినేషన్ బోర్డు (BSEB) బోర్డు BSEB intermediate result 2021 అతి త్వరలో రిలీజ్ కానున్నాయి. మార్చి 25న ద్వితీయ ఇంటర్ ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈ ఫలితాలకు సంబంధించి BSEB నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. బీహార్ బోర్డు ఇంటర్మిడేయట్ ఫలితాలు విడుదలయ్యాక అభ్యర్థులందరూ biharboardonline.com ఆన్ లైన్ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ ఎవాల్యుషన్ ప్రక్రియ పూర్తయిన వెంటనే 10 రోజుల్లోగా BSEB ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. రివైజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 5 నుంచి మార్చి 15 వరకు ఎవాల్యుషన్ ప్రాసెస్ జరుగనుంది. షెడ్యూల్ ప్రకారం.. ఆన్సర్ పేపర్ల ఎవాల్యుషన్ పూర్తి కాగానే మార్చి 25న ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి బోర్డు ఎలాంటి ప్రకటన వెల్లడించలేదు. మార్చి చివరినాటికి లేదా ఏప్రిల్ మొదటివారంలో ద్వితీయ ఇంటర్ ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

అధికారిక ఫలితాలను తేదీని బీహార్ బోర్డు అధికారికంగా త్వరలో ప్రకటించనుంది. BSEB 12th ఇంటర్ పరీక్షలను ఫిబ్రవరి 1వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 13,2021న పూర్తి అయ్యాయి. మార్చి 13న ప్రొవిజినల్ ఆన్సర్ కీని బోర్డు రిలీజ్ చేసింది. మార్చి 16లోగా అభ్యర్థులు ఏమైనా అభ్యంతరాలుంటే సమర్పించేందుకు అవకాశం కల్పించింది. వీటి ఆధారంగా ఆన్సర్ కీని బోర్డు రిలీజ్ చేయనుంది.

BSEB రిజల్ట్స్ 2021 : 10th, 12th results 2021
అభ్యర్థులు తమ ఫలితాల కోసం ఈ కింది వెబ్ సైట్లలో చెక్ చేసుకోవచ్చు.
onlinebseb.in.
biharboardonline.com.
biharboardonline.bihar.gov.in.
biharboard.online.
biharboard.ac.in.