బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ లో సైంటిస్టు B ఉద్యోగాలు 

  • Published By: veegamteam ,Published On : March 4, 2020 / 06:15 AM IST
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్స్ లో సైంటిస్టు B ఉద్యోగాలు 

న్యూఢిల్లీలోని భారత ప్రభుత్వ పరిధిలో ఉన్న డిపార్ట్ మెంటల్ ఆఫ్ కన్జ్యూమర్ ఆఫైర్స్ కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియా స్టాండర్స్(BIS) లో సైంటిస్టు B ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. విభాగాల వారీగా ఖాళీలను భర్తీ చేయనుంది. ఇందులో మెుత్తం 150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

విభాగాల వారీగా ఖాళీలు :
మెకానికల్ ఇంజనీర్ – 48
మెటలర్జీకల్ ఇంజనీర్ – 25
సివిల్ ఇంజనీర్ – 7
ఎలక్ట్రికల్ ఇంజనీర్ –  19
ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 5
కంప్యూటర్ ఇంజనీరింగ్ – 11
పుడ్ టెక్నాలజీ – 14
కెమికల్ ఇంజనీరింగ్ – 16
బయో టెక్నాలజీ – 1
పెట్రో కెమికల్ టెక్నాలజీ – 1
బయో మెడికల్ ఇంజనీరింగ్ – 3

విద్యార్హత : అభ్యర్దులు 60 శాతం మార్కులతో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. గేట్ లో ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ అభ్యర్దులు రూ.100 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్ మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

వయసు : మార్చి 31, 2020 నాటికి అభ్యర్దుల వయసు 30 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపికా విధానం : అభ్యర్దులను షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వూ, 2018, 2019, 2020 సంవత్సరాల గేట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.87 వేల జీతం ఇస్తారు.      

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 2, 2020. 
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 31, 2020.

See Also | కౌంట్ డౌన్ : GSLV F – 10 ప్రయోగానికి ఏర్పాట్లు